Konda Laxman Bapuji Jayanti : జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కొండా లక్ష్మణ్ బాపూజీజయంతి వేడుకలు

TRINETHRAM NEWS

దేవరకొండ సెప్టెంబర్ 27 త్రినేత్రం న్యూస్. దేవరకొండ పట్టణంలో స్థానిక కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహం వద్ద బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కొండా లక్ష్మణ్ బాపూజీ గారి 110వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు ఈ సందర్భంగా సామాజికవేత్త బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ చింతపల్లి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ కొండా లక్ష్మణ్ బాపూజీ స్వాతంత్ర సమరయోధులు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం తొలిమలి దశ ఉద్యమాల్లో తెలంగాణ సాయుధ పోరాటంలో ముందుండి పోరాడినటువంటి మహోన్నతమైన గొప్ప వ్యక్తి అని కొనియాడారు ఈయన ఆశయ సాధన కోసం బీసీ ఎస్సీ ఎస్టీ బహుజన కులాల వారు అందరూ ఐక్యమై రాజ్యాధికారం కోసం ఆయన ఆశయ సాధన కోసం కృషి చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో చొల్లేటి భాస్కరాచారి అంకం చంద్రమౌళి పాత్లావత్ లక్ష్మణ్ నాయక్ లావుడియా భాష నాయక్ దామెర శాంసన్ రెడ్డి యాదయ్య గడ్డం బిక్షమయ్య అప్పం వీరయ్య పెరికేటి శ్రీనివాసచారి నల్లగాసు సత్తయ్య యాదవ్ భీమగొని శివ గౌడ్ సన్నీ తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Konda Laxman Bapuji Jayanti Celebrations

You cannot copy content of this page

Scroll to Top