Konda Lakshman Bapuji Statue : కొండ లక్ష్మణ్ బాపూజీ విగ్రహావిష్కరణ

TRINETHRAM NEWS

ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్

చింతపల్లి ఫిబ్రవరి 20, త్రినేత్రం న్యూస్. చింతపల్లి* మండలంలోని మాల్ గ్రామంలో ఏర్పాటు చేసిన కొండ లక్ష్మణ్ బాపూజీ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొని, కొండ లక్ష్మణ్ బాపూజీ విగ్రహాన్ని ఎం ఎల్ ఏ నేనావత్ బాలు నాయక్, నల్గొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు తో కలిసి ఆవిష్కరించి, ఘన నివాళి అర్పించారు.
తెలంగాణ స్వరాష్ట్ర ఉద్యమానికి ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ అందించిన ప్రజాస్వామిక స్ఫూర్తి, చేసిన త్యాగం మరువలేనిదని ఎమ్మెల్యే తెలిపారు. స్వాతంత్ర్య సమర యోధుడు, తెలంగాణ తొలి తరం ఉద్యమకారుడు, గాంధేయవాది, ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహావిష్కరణ సందర్భంగా వారి కృషిని ఎమ్మెల్యే స్మరించుకున్నారు.
.బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం బాపూజీ చేసిన కృషిని ఆదర్శంగా చేసుకుని అనేక సంక్షేమ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిందని తెలిపారు. వాటిని కొనసాగిస్తూ, బీసీ వర్గాల అభ్యున్నతికి చిత్తశుద్ధితో కృషి చేయడమే వారికి మనమందించే ఘననివాళి అని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, జిల్లా నాయకులు,మండల ముఖ్య నాయకులు, పద్మశాలి సంఘం నాయకులు , యువజన కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Konda Lakshman Bapuji statue unveiling

You cannot copy content of this page

Scroll to Top