Distribution for Students : విద్యార్థుల కోసం యూత్ ఫోర్స్ భారీ వితరణ
డిండి (గుండ్ల పల్లి) ఫిబ్రవరి 20, త్రినేత్రం న్యూస్. డిండి మండల పరిధిలోని పెద్ధతండా: సేవా మార్గంలో పయనిస్తూ ‘పెద్దతండా యూత్ ఫోర్స్’ సభ్యులు తమ గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలకు అత్యాధునిక సౌండ్ సిస్టమ్‌ను (ఆంప్లిఫైయర్, స్పీకర్లు) అందజేశారు. సేవాలాల్ జయంతి ఉత్సవాల సందర్భంగా వారు చేసిన ఈ సహాయాన్ని ఉపాధ్యాయులు, గ్రామస్థులు కొనియాడారు.
పాఠశాల ఉదయం ప్రార్థన, సాంస్కృతిక కార్యక్రమాలకు ఇది ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్న ఉపాధ్యాయ బృందం, యువత చూపిన ఈ చొరవ మిగతా వారికి ఆదర్శమని ప్రశంసించారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం దాతలు, పూర్వ విద్యార్థులు ఇలాగే సహకరించాలని వారు కోరారు
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe

