Kirak should apologize to Botsa : బొత్స సత్యనారాయణకు కిరాక్ ఆర్పీ బేషరతుగా క్షమాపణ చెప్పాలి

TRINETHRAM NEWS

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతపై వెటకారాన్ని సహించేది లేదు

యువ కాపునాడు రాష్ట్ర అధ్యక్షులు ముద్దాల తిరుపతిరావు (అను) తీవ్ర ఆగ్రహం.
త్రినేత్రం న్యూస్… కాపు జాతి ముద్దుబిడ్డ, క్రమశిక్షణ కలిగిన అగ్రనేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రీజినల్ కోఆర్డినేటర్ బొత్స సత్యనారాయణ పై కమెడియన్ కిరాక్ ఆర్పీ చేసిన అనుచిత వ్యాఖ్యల పట్ల ఆంధ్రప్రదేశ్ స్టేట్ కాపు కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ మరియు యువ కాపునాడు రాష్ట్ర అధ్యక్షులు ముద్దాల తిరుపతిరావు (అను) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కిరాక్ ఆర్పీ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని, బేషరతుగా బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

అనారోగ్యాన్ని వెటకారం చేయడం దుర్మార్గంఈ సందర్భంగా ముద్దాల తిరుపతిరావు మాట్లాడుతూ.. “బొత్స సత్యనారాయణ గారు గ్రామీణ స్థాయి నుండి అంచెలంచెలుగా ఎదుగుతూ రాష్ట్రస్థాయి నాయకుడయ్యారు. వేలాది మంది కార్యకర్తలను, నేతలను తయారు చేసిన మహోన్నత వ్యక్తి ఆయన. ఇటీవల ఆయనకు ఎదురైన కొన్ని అనారోగ్య సమస్యల కారణంగా మాటలో స్పష్టత లోపించింది. దానిని ఆసరాగా చేసుకుని ఒక కమెడియన్ స్థాయి వ్యక్తి వెటకారం చేయడం, వ్యంగ్యంగా మాట్లాడటం అత్యంత హేయమైన చర్య” అని మండిపడ్డారు
ఆరోగ్యం అనేది ఎవరి చేతుల్లో ఉండదు. ఈరోజు బొత్స కి వచ్చిన సమస్య రేపు ఏ నేతకైనా రావచ్చు. అప్పుడు కూడా ఇలాగే కమెడియన్లు వెటకారం చేస్తే చూస్తూ ఊరుకుంటారాఅని ప్రశ్నించారు.ప్రజా నాయకులను కించపరిచేలా వ్యవహరిస్తున్న కిరాక్ ఆర్పీపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.బొత్స వ్యక్తిత్వం గురించి, ఆయన చేసిన సేవ గురించి తెలియకుండా మాట్లాడటం మానుకోవాలని, నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు.

ప్రజా సమస్యల కోసం నిరంతరం శ్రమించే బొత్స లాంటి సీనియర్ నేతను గౌరవించడం నేర్చుకోవాలి. కిరాక్ ఆర్పీ వెంటనే తన తప్పు తెలుసుకుని క్షమాపణ చెప్పకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది అని ముద్దాలతిరుపతిరావు అన్నారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Kirak RP should apologize unconditionally to Botsa Satyanarayana

You cannot copy content of this page

Scroll to Top