
Formula E Car Race Case : త్రినేత్రం న్యూస్ : హైదరాబాద్: ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో అవినీతి ఆరోపణలపై ఏసీబీ (ACB) చార్జిషీట్ దాఖలు చేసింది. ఈ కేసులో పలువురు ప్రముఖులను నిందితులుగా చేర్చింది.
చార్జిషీట్‌లో నిందితులు: A1గా కేటీఆర్… A2గా ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్… A3గా హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బి.ఎల్.ఎన్ రెడ్డి… A4గా స్పోర్ట్స్ కన్సల్టెంట్ కిరణ్ మల్లేశ్వరరావు… A5గా యూకేకు చెందిన ఎఫ్ ఈ ఓ సంస్థ.. ఏసీబీ ఆరోపణల ప్రకారం, నిబంధనలకు విరుద్ధంగా సుమారు ₹55 కోట్లు విదేశీ సంస్థలకు మళ్లించినట్లు చార్జిషీట్‌లో పేర్కొంది.
ఈ పరిణామం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేపుతోంది. కేసు దర్యాప్తు మరింత కీలక దశలోకి వెళ్లే అవకాశముంది.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news

