త్రినేత్రం న్యూస్, జనవరి 16, కేశవరం గ్రామంలో కొలువైన ప్రసిద్ధగాంచిన, గానిపోతురాజు స్వామిని రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్, స్థానిక ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు, దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. అనంతరం గ్రామ ప్రజల సుఖసంతోషాలు, రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసం స్వామి ఆశీస్సులు కోరుకున్నారు.
ఆలయ ప్రాంగణంలో భక్తులను ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడుతూ, గానిపోతురాజు స్వామి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరికీ మంచి జరగాలని ఆకాంక్షించారు. దేవాలయాల అభివృద్ధికి ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి ఉందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేను శాలువాతో ఘనంగా సత్కరించి, తీర్థ ప్రసాదాలు అందజేశారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


