Wall Poster Unveiling : దావతే ఇస్లామి ఇజ్తిమా గోడ పోస్టర్ ఆవిష్కరణ

TRINETHRAM NEWS

జనవరి 24 25 తేదీల్లో జడ్చర్ల పట్టణంలో నిర్వహించు గో ఇస్తేమాను జయప్రదం చేయండి.

డిండి ( గుండ్ల పల్లి)జనవరి 16 త్రినేత్రం న్యూస్. డిండి మండల కేంద్రంలో స్థానిక ఖాద్రీయ మసీదులో శుక్రవారం రోజు దావత్ ఎ ఇస్లామీ ఇండియా ఇజ్తిమా 2026 అచ్చంపేట మదని ఖాఫీలా ముఖ్యులు ఈ కార్యక్రమం గురించి మాట్లాడుతూ జనవరి 24 ,25 లో జరుగు రెండు రోజుల ఇస్తేమాను జయప్రదం చేయాలని కోరారు.

డిండి పట్టణ మరియు పరిసర ప్రాంతాల ముస్లిం యువకులు పెద్దలు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంచేసి ఆ అల్లాహ్ (దేవుని ) కృపకు పాత్రులు కాగలరని పేర్కొన్నారు. అనంతరం గోడ పోస్టర్లను విడుదల చేశారు.

ఈ కార్యక్రమంలో డిండి పట్టణ ఉప సర్పంచ్ కౌసర్ రషీద్, సయిద్ అత్తారి, బాబా అత్తారి, మైనార్టీ పట్టణ అధ్యక్షులు షేఖ్ ఉమర్, మాజీ అధ్యక్షులు అబ్దుల్ కలీమ్,మహ్మద్ అబ్దుల్ ఖాదర్, ఖాద్రియ మజీద్ ఇమామ్ నజ్దురుల్ హక్, జహంగీర్, ఖయ్యాం, మైనార్టీ యువజన నాయకులు , మైనార్టీ కమిటీ సభ్యులు , పెద్దలు, పిల్లలు తదితరులు పాల్గొన్నారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Dawat-e-Islami Ijtima wall poster unveiling

You cannot copy content of this page

Scroll to Top