BRS to Congress : బిఆర్ఎస్ పార్టీకి గుడ్ బాయ్ చెప్పి కాంగ్రెస్ పార్టీ లో చేరిన కన్నూరు సతీష్ కన్నురి సురేష్

TRINETHRAM NEWS

Trinethram News : తేదీ 01/02/2026 పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం గోదావరిఖని… ఈరోజు రామగుండం క్యాంపు కార్యాలయంలో శాసనసభ్యులు ఎం.ఎస్. రాజ్ ఠాగూర్ ఆధ్వర్యంలో 46వ డివిజన్ ఇంద్రానగర్‌కు చెందిన కన్నూరి సతీష్, కన్నూరి సురేష్‌లతో పాటు పలువురు ఇతర నాయకులు కాంగ్రెస్ పార్టీలో అధికారికంగా చేరారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారికి పార్టీ కండువాలు కప్పి హృదయపూర్వకంగా స్వాగతం పలికారు. కాంగ్రెస్ పార్టీ విధానాలు, సంక్షేమ కార్యక్రమాలపై విశ్వాసంతో పార్టీలో చేరిన నాయకుల సేవలు ప్రజలకు మరింత చేరువయ్యేలా కృషి చేయాలని ఆయన ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ కార్పొరేటర్లు వివిధ విభాగాల అధ్యక్షులు తదితరులు ఉన్నారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Kannuru Satish and Kannuri Suresh, who said goodbye

You cannot copy content of this page

Scroll to Top