తేదీ : 09/08/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, జిల్లా కేంద్రమైన భీమవరం జగన్మాత కనకదుర్గ అమ్మవారికి పౌర్ణమి సందర్భంగా యాభై వేల గాజుల తో అలంకరణ చేశారు. ఆలయ కమిటీ పరిరక్షణలో సంబంధించిన అర్చకులు లక్ష కుంకుమార్చన, చక్రార్చన పూజలు నిర్వహించడం జరిగింది.
నూట ఎనిమిది కేజీల పసుపు, కుంకుమ వేయి రవికులతో అమ్మవారిని అలంకరించారు. ఆదివారం అనగా ఈనెల పది వ తేదీన వేయి మంది ముత్తైదువులకు ఈ గాజులను అందజేస్తామని ఆలయ కమిటీ ప్రకటించింది.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


