పిచికారి లేదు,బ్లీచింగ్ లేదు.
నిధులు అగ్ని పరీక్షలో..
ప్రజల ఆరోగ్యం మూల్యం లో!
డిండి (గుండ్ల పల్లి) 09. త్రినేత్రం న్యూస్. పారిశుధ్య పరిస్థితులు పూర్తిగా దిగజారి పోయాయి. రాత్రివేళ దోమల మోతలతో ప్రజలు నిద్రలు కొల్పోతుంటే,జ్వరాలు ,ఖర్చులతో పోరాడుతుంటే ప్రభుత్వం మౌనంగావుంటే ఈ పరిస్థితికి పరిష్కారం ఎక్కడినుండి వస్తుంది.?
పేద ప్రజల ఆరోగ్యాన్ని పోగొట్టుకొంటుంటే ,నిస్సహాయంగా తమజీవితాలను వదిలేస్తున్నారు. గ్రామపంచాయతీ చేతులు ఎత్తేశారు, డీజిల్ ఖర్చులు తేయలేరు, గ్రామపంచాయతీ కార్మికుల జీతాలు చేళ్ళించలేరు, చెత్త ఎక్కడ పడితే అక్కడ గుట్టలు గుట్టలుగా , డ్రైనేజీలు సక్రమంగా శుభ్రం చేయక దోమలు ఎక్కువై రాత్రి ఐతే చాలు దోమల మోత ఎక్కువై ప్రజల కంటిమీద కునుకు లేకపోతుంది. దోమల విపరీతంగా ఎక్కువై విజృంభిస్తున్నాయి. అసలే సీజనల్ వ్యాధులు ప్రాబల్యం చూపకముందే గ్రామపంచాయతీ అధికారులు ముందస్తుగా బ్లీచింగ్ పౌడర్ చ దోమల స్ప్రే కొట్టడం ద్వారా దోమలను, రోగాలను నియంత్రించవచ్చని ప్రజలు పేర్కొంటున్నారు. కాబట్టి గ్రామపంచాయతీ అధికారులు వెంటనే స్పందించి ఈ సమస్యను పరిష్కరించి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని కోరుతున్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


