
Juttu Satish : దేవరకొండ డివిజన్ జూన్ 23, త్రినేత్రం న్యూస్ : రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలని, అలాగే ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఫీజులను నియంత్రించాలని బహుజన సమాజ్ పార్టీ జుట్టు సతీష్ డిమాండ్ చేసారు. ప్రభుత్వం విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేసి కార్పొరేట్ సంస్థలకు ప్రభుత్వం కొమ్ముకాస్తోందని, దీనివల్ల పేద, మధ్యతరగతి తల్లిదండ్రులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు.
ఫీజుల నియంత్రణ: – ప్రైవేట్ విద్యాసంస్థలు ఇష్టానుసారంగా వసూలు చేస్తున్న అధిక ఫీజులు, డొనేషన్లను అరికట్టడానికి ప్రభుత్వం ప్రత్యేక చట్టాన్ని తేవాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్లు, త్రాగునీరు, ఉపాధ్యాయుల నియామకం వంటి సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరారు.విద్యా హక్కు చట్టం (ఆర్ టీ ఈ): ప్రైవేట్ పాఠశాలల్లో పేద విద్యార్థులకు 25 శాతం సీట్లు కేటాయించే నిబంధనను కచ్చితంగా అమలు చేయాలని స్పష్టం చేశారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe