Trinethram News : తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లి మండలం యర్నగూడెం గ్రామానికి చెందిన పుట్టా వీర వెంకట రమణ30 మండలంలోని కొత్తగూడెంలో నివాసం వుంటున్నారు
గురువారం రాత్రి బైక్ పై వెళ్తుండగా కృష్ణంపాలెం వద్ద రోడ్ పై ఆరబోసిన ధాన్యం కళ్ళాలపై కప్పిన బరకం క్రింద వున్న రాయి తగలి తలకు తీవ్ర గాయాలు కావడంతో హైవే పోలీస్ గోపాలపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు
కొందరు రైతులు ధాన్యాన్ని రహదారిపై ఆరపోసుకుని సరైన జాగ్రత్తలు తీసుకోక పోవడం సూచికలు ఏర్పాటు చేయకపోవడం నల్లని బరకాలు కప్పడం రాళ్ళను వాటిపై వుంచడం వల్ల రాత్రి సమయంలో వాహన చోదకులకు పలు ప్రమాదాలు జరుగుతూ క్షతగాత్రులు కావడం ప్రాణాలు కోల్పోవడం జరుగుతుందని పలువురు తెలిపారు…
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


