నవంబర్ 22, 2026
TRINETHRAM NEWS
Bat symbol campaign

వర్షాన్ని సైతం లెక్కచేయకుండా ఇంటింటా ప్రచారం.. స్వతంత్ర ఎంపీటీసీ అభ్యర్థి చిక్కుడు మల్లేష్‌

Bat Symbol Campaign : డుంబ్రిగూడ, నవంబర్ 3, (త్రినేత్రం న్యూస్): స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో డుంబ్రిగూడ మండలంలోని కొల్లాపుట్టు గ్రామ పంచాయతీ పరిధిలో ఎంపీటీసీ స్వతంత్ర అభ్యర్థి చిక్కుడు మల్లేష్ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా ఆయన అనుచరులు, కార్యకర్తలు, అభిమానులు, గ్రామ నాయకులు, మహిళలు ప్రచారంలో పాల్గొంటూ ఓటర్లను కలుస్తున్నారు.
సోమవారం పంచాయతీ పరిధిలోని వివిధ గ్రామాల్లో గడపగడపకు వెళ్లి బ్యాట్ గుర్తును పరిచయం చేస్తూ ఓటర్ల మద్దతును కోరారు. యువత సైతం ప్రచారంలో చురుగ్గా పాల్గొంటూ బ్యాట్ గుర్తుకు ఓటు వేసి చిక్కుడు మల్లేష్‌ను గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్నారు. పోలింగ్ విధానం, ఓటు హక్కు వినియోగంపై కూడా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.
ఈ సందర్భంగా అభ్యర్థి చిక్కుడు మల్లేష్ మాట్లాడుతూ.. “నేను మీలో ఒకడిని.. మీ వాడిని. మీ ఆదరాభిమానాలతో బ్యాట్ గుర్తుపై ఓటు వేసి నన్ను ఆశీర్వదించండి” అంటూ గ్రామ ఓటర్లను అభ్యర్థించారు.
ఈ ప్రచార కార్యక్రమంలో మాజీ సర్పంచులు కొర్ర సీతారాం, జి. సుందర్ రావు, గ్రామ పెద్దలు పి. నూకన్న, చెంబు నాయుడు, ఉప సర్పంచులు వి. భీమన్న, వి. కొండలరావు, జె. తమ్మయ్య, మాజీ వార్డు సభ్యులు ఎస్. ఓనం, రాజు, కృష్ణ, సూర్యారావు, నారాయణ తదితర నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page