
కుండ గుర్తుతో గ్రామగ్రామాన ముమ్మర ప్రచారం.. స్థానికుల నుంచి విశేష స్పందన
Janni Kamala : అరకులోయ అక్టోబర్ 31, (త్రినేత్రం న్యూస్): అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు వేలి మండలం,పెదలబుడు సెగ్మెంట్–2లో స్వతంత్ర ఎంపీటీసీ అభ్యర్థిగా బరిలో నిలిచిన జన్ని కమల (భర్త సురేష్) ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. కుండ గుర్తుపై పోటీ చేస్తున్న ఆమె సెగ్మెంట్ పరిధిలోని శరభగూడతో పాటు వివిధ గ్రామాల్లో విస్తృతంగా పర్యటిస్తూ ఓటర్లను కలుసుకుంటూ మద్దతు కోరుతున్నారు.
ప్రతి గ్రామంలోనూ ప్రజలను నేరుగా కలుస్తూ తన ఎన్నికల గుర్తు కుండను పరిచయం చేస్తూ ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు. స్థానిక గ్రామాల నుంచి తనకు మంచి ఆదరణ లభిస్తోందని, ప్రజల స్పందన ఉత్సాహాన్ని ఇస్తోందని పేర్కొంటున్నారు.పెదలబుడు సెగ్మెంట్–2 పరిధిలో కుండ గుర్తుపై ప్రజల్లో ఆసక్తి నెలకొందని ఆమె మద్దతుదారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
గ్రామాల అభివృద్ధే తన ప్రధాన లక్ష్యమని, ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని జన్ని కమల తెలిపారు. ముఖ్యంగా సామాన్య ప్రజలకు అందుబాటులో ఉంటూ, వారి కష్టసుఖాల్లో తోడుగా నిలిచి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇస్తున్నారు.
ఈ ఎన్నికల్లో తనకు ఒక అవకాశం కల్పించి, పెదలబుడు సెగ్మెంట్–2లో కుండ గుర్తుపై ఓటు వేసి నన్ను ఎంపీటీసీగా గెలిపించాలని జన్ని కమల ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. గ్రామాల అభివృద్ధి, ప్రజాసేవే లక్ష్యంగా ఎన్నికల బరిలో ముందుకు సాగుతున్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe