కూకట్పల్లి త్రినేత్రం న్యూస్ జులై 4 : ఈరోజు కూకట్ పల్లి నియోజకవర్గంలోని బాలాజీ నగర్ లో తెలంగాణ కాపు సేవా సమితి ఆధ్వర్యంలో జరిగిన వంగవీటి మోహన రంగా 78వ జయంతి వేడుకల్లో జనసేన పార్టీ కూకట్‌పల్లి నియోజకవర్గం ఇంచార్జ్ ముమ్మారెడ్డి ప్రేమ కుమార్ పాల్గొని, రంగా విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి అభిమానుల సమక్షంలో కేక్ కట్ చేశారు. అనంతరం తెలంగాణ కాపు సేవా సమితి బృందం ప్రేమ కుమార్ ని సాలువాతో సత్కరించారు.ఈ సందర్భంగా ప్రేమ కుమార్ మాట్లాడుతూ రంగా బడుగు బలహీన వర్గాల అశాజ్యోతి ఆయన పేదల కోసం పోరాడుతూనే ప్రాణాలు వదిలారు అని గుర్తు చేసుకొని రంగా 78వ జయంతి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన కమిటీ సభ్యులందరినీ అభినందించారు.ఈ కార్యక్రమంలో కూకట్పల్లి జనసేన పార్టీ నాయకులు కొల్లా శంకర్ , భోగాది వెంకటేశ్వరరావు, అడబాల షణ్ముఖ ,పోలే భోయన శ్రీనివాస్ , బండ్రెడ్డి గోపి , పులగం సుబ్బు తదితరులు పాల్గొన్నారు .
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


