తేదీ : 04/07/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పోలవరం నియోజవర్గం , బుట్టాయిగూడెం, జీలుగుమిల్లి మండలం లో ఉన్నటువంటి మండల ప్రజా పరిషత్ పాఠశాల, మరియు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఇంటర్వ్యూలో భాగంగా వాళ్లు మాట్లాడుతూ ప్రభుత్వం కేటాయించినటువంటి సమయం ప్రకారం పాఠశాలలు తెరుస్తున్నామని చెప్పడం జరిగింది, అదే విధంగా విద్యార్థులకు క్రమశిక్షణతో కూడిన విద్యా బోధన, ఆటలు, సన్న బియ్యంతో కూడిన అన్నము, కూరగాయలు మరియు ఆకుకూరలు తో పౌష్టిక ఆహారాన్ని అందిస్తున్నామని తెలిపారు. రోజు విడిచి రోజు రాగి జావా మరియు, బెల్లం వేరుశనగలతో తయారు చేసినటువంటి చిక్కీలు ఇస్తున్నమని అన్నారు. విద్యార్థులకు సంబంధిత మెటీరియల్స్ అందాయని తెలిపారు. ఏ ఏ పాఠశాలలో ఎంతమంది విద్యార్థులు ఉన్నారో , కొత్తగా ఎంతమంది విద్యార్థులు జాయినింగ్ అయ్యారో చెప్పడం జరిగింది.
ప్రధానోపాధ్యాయులు పూచికపాడు సున్నం. సూరిబాబు, ఆర్ మరియు ఆర్ కాలనీ తల్లవరం పి. నవీన్ , దిబ్బగూడెం యం. రాణి, వేపులపాడు ఆర్. వెంకటేశ్వరరావు, పందిరి మామిడిగూడెం కె. స్వర్ణలత, కామవరం వంకా.ధర్మరాజు, మోతగూడెం వంకా. శ్రీను , ఇనుమునూరు టి. మనోహర్, గాడిద బోరు సిహెచ్. శైలు, గుబ్సి మామిడి టి. కృష్ణవేణి సంబంధిత వివరణలు తెలపడం జరిగింది. అదేవిధంగా పూచికపాడు పాఠశాలలో విద్యార్థులకు వర్క్ బుక్స్ రావాలని ప్రధానోపాధ్యాయులు అన్నారు. తల్లవరం పాఠశాలలో ప్రహరీ గోడ అవసరమని ఉపాధ్యాయులు తెలిపారు. కిచెన్ షెడ్డు పనులు జరుగుతున్నాయని అన్నారు. విద్యార్థులు మరియు వాళ్ల తల్లిదండ్రులు కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నారని చెప్పడం జరిగింది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


