Prema Kumar : స్వామి వివేకానంద 163 వ జయంతి ఉత్సవంలో పాల్గొన్న జనసేన నాయకులు

TRINETHRAM NEWS

కూకట్పల్లి జనవరి 12 (త్రినేత్రం న్యూస్) ఈ రోజు కేపీహెచ్‌బీ కాలనీ రోడ్ నెంబర్ 1లో గల స్వామి వివేకానంద విగ్రహం వద్ద నిర్వహించిన 163వ జయంతి ఉత్సవాలకి ఛత్రపతి ధర్మ రక్షణ సేన వ్యవస్థాపక అధ్యక్షులు కర్ర వేణు గోపాల్ ఆహ్వానం మేరకు ముఖ్య అతిథిగా కూకట్‌పల్లి నియోజకవర్గ జనసేన పార్టీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే అభ్యర్థి ముమ్మారెడ్డి ప్రేమ కుమార్ పాల్గోని, స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి నివాళు అర్పించారు.ఈ సందర్భంగా ప్రేమ కుమార్ మాట్లాడుతూ,
స్వామి వివేకానంద జీవితం, త్యాగం, దేశభక్తి, యువతకు ఇచ్చిన ఆత్మవిశ్వాస సందేశాలు నేటి తరానికి మార్గదర్శకమని తెలిపారు.ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు కొల్లా శంకర్, పోలేబోయిన శ్రీనివాస్, ఆకుల రాము ఛత్రపతి కమిటీ సభ్యులు నాగేశ్వర్ గుప్తా, ముత్యాల నాగేందర్, తండూర్ సునీత, కర్ర లక్ష్మి, ప్రసన్న, నాగేశ్వర్ ప్రసాద్, కే ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Janasena leaders participated in the 163rd birth anniversary celebrations of Swami Vivekananda

You cannot copy content of this page

Scroll to Top