పాడేరులో క్రియాశీలక సభ్యత్వానికి విశేష స్పందన. అనిల్ కుమార్.
అల్లూరిజిల్లా పాడేరు త్రినేత్రం న్యూస్ ఏప్రిల్ 9: జనసేన పార్టీ పాడేరు అసెంబ్లీ నియోజకవర్గం మరియు అరకు పార్లమెంట్ ఇంచార్జ్ వంపూరు గంగులయ్య ఆదేశాల మేరకు పాడేరు జనసేన కార్యాలయంలో క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఐటీ టీమ్ కో-ఆర్డినేటర్ సీ.హెచ్.అనిల్ కుమార్ నేతృత్వంలో నిర్వహించగా, అరకు పార్లమెంట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడు కొర్ర కమల్ హాసన్, అధికార ప్రతినిధి బొంకుల దివ్యలత తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సీ.హెచ్.అనిల్ కుమార్ మాట్లాడుతూ, జనసేన అధ్యక్షుడు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం ద్వారా సాధారణ కార్యకర్తల శ్రమను గుర్తించి, ప్రోత్సహించడం జనసేన ప్రత్యేకతగా పేర్కొన్నారు. కార్యకర్తల శ్రేయస్సు కోసం తన వ్యక్తిగత సంపాదననుంచి కోట్ల రూపాయలు వెచ్చించిన ఘనత పవన్ కళ్యాణ్ కే ప్రత్యేకమని తెలిపారు.
ఎగ్జిక్యూటివ్ మెంబర్ కొర్ర కమల్ హాసన్ మాట్లాడుతూ, జనసేన పార్టీ సభ్యత్వం ఎంతోమందికి భరోసా కల్పిస్తోందని, కార్యకర్తల కోసం ఏర్పాటు చేసిన భీమా సౌకర్యం ద్వారా ప్రమాద సమయంలో రూ.50,000 వైద్య సహాయం, ప్రాణహాని జరిగిన పక్షంలో రూ.5 లక్షల బీమా కల్పించడం పార్టీ మానవతా విలువలకు నిదర్శనమని పేర్కొన్నారు.
అధికార ప్రతినిధి బొంకుల దివ్యలత మాట్లాడుతూ, జనసేన పార్టీ సామాజిక సమానత్వాన్ని కాంక్షిస్తూ యువత కలలను సాకారం చేసే ఆశయాలతో ముందడుగు వేస్తోందని, పార్టీ కార్యకర్తలను కుటుంబ సభ్యులలా భావించి వారి భద్రత కోసం పవన్ కళ్యాణ్ చేపట్టిన క్రియాశీలక సభ్యత్వం గొప్ప సంకల్పమని అభినందించారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు అయ్యప్ప పాత్రుడు, మండల నాయకులు ముదిలి సుబ్బారావు, కంఠ సుమన్, ఉల్లి సాయి తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం జనసేన కార్యకర్తల ఉత్సాహంతో విజయవంతంగా జరిగింది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


