Agriculture Officer : పత్తి రైతులు కపాస్ కిసాన్ యాప్ ఉపయోగించుకోవాలి

TRINETHRAM NEWS

మండల వ్యవసాయాధికారి రెహానా.

డిండి (గుండ్ల పల్లి) అక్టోబర్ 22 త్రినేత్రం న్యూస్. కపాస్ కిసాన్ యాప్ లో రైతులు నమోదు చేసుకోవాలని డిండి మండల వ్యవసాయాధికారి రెహానా ఒక ప్రకటనలో తెలిపారు. పత్తి పంట పండించిన రైతులు తమ పత్తిని సి సి ఐ కొనుగోలు కేంద్రాల్లో అమ్మాలంటే ముందుగా రైతులు వ్యక్తిగతంగా కపాస్ కిసాన్ మొబైల్ యాప్ ప్లేస్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకొని తమ మొబైల్ నెంబర్ తో లాగిన్ అవ్వాలని అనంతరం స్లాట్ బుక్ చేసుకుని మిల్లుకు పత్తిని తీసుకొనిపోవాలని అన్నారు. ఫోన్ నెంబర్ అక్రియేషన్ లేనివారు ఫోన్ నంబర్ అప్డేట్ కొరకు వ్యవసాయ విస్తరణ అధికారులను సంప్రదించాలని సూచించారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Cotton farmers should use the Kapas Kisan app

You cannot copy content of this page

Scroll to Top