కూకట్పల్లి త్రినేత్రం న్యూస్ జూన్ 3: కూకట్ పల్లి లోని జనసేన పార్టీ కార్యాలయంలో తెలంగాణలో ప్రమాదవశాత్తు మరణించిన నిజామాబాద్ జిల్లా బాన్సువాడ నియోజకవర్గంకు చెందిన కేతావత్ హరి సింగ్ , మహబూబ్నగర్ జిల్లా గద్వాల్ నియోజకవర్గానికి చెందిన బొప్పల జమున, నల్గొండ జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గకు చెందిన కుర్ర సైదులు జనసైనికుల కుటుంబాలకు జనసేన అధినేత మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ నేమూరి శంకర్ గౌడ్ , ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్, కావ్య మండపాక, ఆర్కే సాగర్ చేతుల మీదుగా బాధిత కుటుంబానికి 5 లక్షల చొప్పున బీమా చెక్కులను అందజేయడం జరిగింది.
ఈ సందర్భంగా శ్రీ శంకర్ గౌడ్ మాట్లాడుతూ ప్రమాదవశాత్తు మరణించిన జన సైనికుల కుటుంబాలకు ఆసరా ఉండాలన్న ఆలోచనతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీసుకువచ్చిన ఈ బీమా సౌకర్యం ఎంతోమంది జనసేనకుల కుటుంబాలకు భరోసాను కల్పిస్తుంది అని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో కొల్లా శంకర్, కలిగినేని ప్రసాద్ ,పులగం సుబ్బు ,వెంకట్ దొరబాబు, అనిత తదితరులు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


