AITUC : పార్క్స్ కూలీలకు పీఫ్,ఈ ఎస్ ఐ అమలుపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్, కాకినాడ, సెప్టెంబర్,19: కాకినాడ పార్క్స్ లో పనిచేస్తున్న కూలీల సమస్యలు తెలుసుకునేందుకు ఏఐటీయూసీ, జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్ గురువారం ఉదయం కులాయి చెరువు పార్కును సందర్శించారు. ప్రసాద్ ఈ సందర్భంగా మాట్లాడుతూ కాకినాడలో కుళాయి చెరువు పార్కు, గాంధీనగర్ పార్కులో కూలీలు పనిచేస్తున్నారని వారికి సుమారు అయిదు నెలలుగా పి.ఎఫ్, ఈ.ఎస్.ఐ కాంట్రాక్టర్ చెల్లించడం లేదని, పీఎఫ్ ఈఎస్ఐ సక్రమంగా చెల్లించలేని కారణంగా వారికి వైద్య సదుపాయం అందడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

పార్క్స్ కూలీలకు పిఎఫ్ ఈఎస్ఐ శ్రీ లక్ష్మీ గణపతి ఏజెన్సీ కాంట్రాక్టర్ కట్టడం లేదని కాకినాడ కార్పొరేషన్ లో స్పందనలో ఫిర్యాదు చేసిన స్పందన కరువైందని ఆయన అన్నారు. కార్పొరేషన్ అధికారులు పార్కులను కాంట్రాక్ట్ ఇచ్చామని కాంట్రాక్టర్కు సంబంధమని కాకినాడ కార్పొరేషన్ సంబంధం లేదని కుంటి సాకులు చెబుతూ కాంట్రాక్టర్ కి కొమ్ముకాస్తున్నారని ఆయన అన్నారు.పార్క్ కూలీలకు నెలకు 16,800 వేతనాలు మంజూరు చేస్తున్నామని కార్పొరేషన్ వారు కాంట్రాక్టర్కు బిల్లు పెట్టి మంజూరు చేస్తున్నారని కానీ వారికి నెలకు 9000 మాత్రమే మంజూరు చేస్తున్నారని ఆయన అన్నారు. పి.ఎఫ్ ఈఎస్ఐ చెల్లించని కాంట్రాక్టర్ పై ఇప్పటికైనా అధికారులు చర్యలు తీసుకోవాలని, నిర్లక్ష్య మొండు వైఖరి విడనాడాలని పార్కు కూలీలకు కాంట్రాక్టర్ నుండి పిఎఫ్ ఈఎస్ఐ కట్టేందుకు అధికారులు చొరవ చూపాలని లేకుంటే ఉద్యమాన్ని ప్రారంభిస్తామని ప్రసాద్ అన్నారు. ఈ కార్యక్రమంలో పార్క్ వర్కర్స్ కూలీలు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Municipal Corporation officials are being negligent

You cannot copy content of this page

Scroll to Top