Merged Police Station : జనగామ డివిజన్ ను టూ టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో కలపండి

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ జనగామ ప్రతినిధి. రామగుండం నగర పాలక సంస్థ పరిధిలోని ఆరవ డివిజన్ జనగామ ను యైటింక్లయిన్ కాలనీ లోని రెండవ టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి గోదావరిఖని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో కలపాలని సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు తొడుపునూరి రమేశ్ కుమార్ ఒక ప్రకటన లో రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.

జనగామ డివిజన్ గతంలో గ్రామ పంచాయతీ గా ఉందని అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు ఐదు దశాబ్దాలు గడిచినా ఇప్పటికీ టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉందని, దీని వల్ల డివిజన్ ప్రజలకు ఎమైనా అవసరం గానీ, శాంతి భద్రతల సమస్య ఉంటే 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న టూ టౌన్ పోలీస్ స్టేషన్ కు వెళ్ళడం ఇబ్బందికరంగా ఉందని , అదేవిధంగా గ్రామ పంచాయతీ గా ఉన్న జనగామ గ్రామం నోటిఫైడ్ ఏరియా, మున్సిపల్ నుంచి కార్పొరేషన్ లో విలీనం జరిగిందని ఆయన పేర్కొన్నారు.

కనుక గోదావరిఖని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ జనగామ డివిజన్ కు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్నందున ఇందులో విలీనం చేసి డివిజన్ ప్రజలకు ఉపయోగపడే విధంగా రాష్ట్ర ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Janagama Division to be merged

You cannot copy content of this page

Scroll to Top