గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. గోదావరిఖని భాస్కర్ భవన్ లో సోమవారం సిపిఐ నగర సమితి, ఆధ్వర్యంలో ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు కామ్రేడ్ గోసిక మోహన్, కామ్రేడ్ గౌతం గోవర్ధన్, ఆర్జీ వన్ బ్రాంచి సహాయ కార్యదర్శి కామ్రేడ్ రంగు శ్రీనివాస్ ముందుగా గుండా మల్లేష్ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.అనంతరం సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు కామ్రేడ్ గోసిక మోహన్, కామ్రేడ్ గౌతం గోవర్ధన్ లతో కలిసి సిపిఐ నగర కార్యదర్శి కామ్రేడ్ కే.కనక రాజ్ మాట్లాడుతూ కామ్రేడ్ గుండా మల్లేష్ నిరుపేద కుటుంబంలో జన్మించి
1966లో సిపిఐ పార్టీలో చేరి అనేక కార్మిక కర్షక యువజన పోరాటాల నిర్వహించి అంచలంచెలుగా ఎదిగి సిపిఐ శాసనసభ్యులుగా నాలుగుసార్లు గెలిచి ప్రజా సమస్యల పరిష్కారం కోసం అసెంబ్లీలో తన గళాన్ని వినిపించారని అన్నారు.1983లో తెలుగుదేశం పార్టీ ప్రభంజంలో సైతం అసిఫాబాద్ నుండి సిపిఐ ఎమ్మెల్యేగా గెలిచాడని వారు తెలిపారు. మూడుసార్లు ఆసిఫాబాద్ నుండి ఒకసారి బెల్లంపల్లి నుండి శాసనసభ్యునిగా ఎన్నికై సిపిఐ పక్ష నాయకునిగా పనిచేశారని అన్నారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ రాష్ట్రం కావాలని గొంతెత్తి నినదించి
శ్రీకృష్ణ కమిటీ ముందు ప్రత్యేక తెలంగాణ ఇవ్వాల్సిందేనని కమ్యూనిస్టు పార్టీ తరఫున నివేదికను సమర్పించి ఢిల్లీకి వెళ్లి తన వాదనలను గట్టిగా వినిపించాడని తెలంగాణ రాష్ట్రం.. ఏర్పాటు అయ్యిందంటే కామ్రేడ్ గుండా మల్లేష్ అన్న కృషి పట్టుదల వల్ల కమ్యూనిస్టు పార్టీ పోరాటం వల్లనేనని వారన్నారు.దళితుల అభ్యున్నతి కోసం దళిత హక్కుల పోరాట సమితి నీ ఏర్పాటు చేసి జాతీయ స్థాయిలో దళితుల పట్ల జరుగుతున్న అణిచివేతకు వ్యతిరేకంగా అనేక పోరాటాలు నిర్వహించారని తెలిపారు.ఆజాత శత్రువుగా, నిరుపేదల పెన్నిధిగా నియోజకవర్గ ప్రజల ఆప్తమిత్రునిగా ప్రతి ఒక్కరిని కుటుంబ సభ్యులు గా ఆదరించే మంచి మనసున్న మల్లేషన్న ఆశయ సాధన కోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలని, వారు చేసిన త్యాగాలను భవిష్యత్ తరాలకు తెలియజేస్తూ పార్టీని ప్రజా సంఘాలను బలోపేతం చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు మడికొండ ఓదేమ్మ, ఏ ఐ వై ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ మార్కాపురి సూర్య, జిల్లా సమితి సభ్యులు మాటే టి శంకర్, టి . రమేష్ కుమార్,నాయకులు పడా ల కనక రాజ్,గండి ప్రసాద్, వెంకట రెడ్డి, ప్రభుదాస్, మా మానాల శ్రీనివాస్ ,జగన్ ,ఆసాల నవీన్,సాయన్న, తదితరులు పాల్గొన్నారు
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


