4 నెలల పెండింగ్ వేతనాలు తక్షణమే చెల్లించాలి

TRINETHRAM NEWS

ఎన్ హెచ్ ఎం కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ రాజేష్ ఖన్నా డిమాండ్

త్రినేత్రం న్యూస్ హైదరాబాద్ జిల్లా ప్రతినిధి. తెలంగాణ రాష్ట్రంలో ఎన్ హెచ్ ఎం ఎంప్లాయిస్ కి గత నాలుగు నెలలుగా సక్రమంగా జీతాలు లేకపోవడం వల్ల కుటుంబ పోషణ అనేది దయనీయంగా మారింది దానివల్ల మనోవేదనకు గురై చాలా ఇబ్బంది పడుతున్నారు.

ఉద్యోగులందరూ ఇలాంటి కష్టం లో ఉన్నా కూడా ప్రజా ఆరోగ్యమే మా భాగ్యమని ఆశిస్తూ ప్రజలకు అందించే సేవలు మాత్రం ఆపివేయలేదు సో దయచేసి ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న జాతీయ ఆరోగ్య మిషన్ ఉద్యోగులకు రావలసిన నాలుగు నెలల పెండింగ్ వేతనాలు అనగా సెప్టెంబర్, అక్టోబర్ ,నవంబర్ మరియు డిసెంబర్ వేతనాలు విడుదల చేయాలని, చిరు ఉద్యోగులు చిన్న ఉద్యోగులు చిన్న వేతనాలు వారికి వచ్చే నెలకు 10 వేల రూపాయలు మాత్రమే వస్తున్నాయని, నాలుగో తరగతి ఉద్యోగులకు 15,600 పెంచామని అందరూ అంటున్నారు.

నిన్న డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మల్లు భట్టి విక్రమార్క అసెంబ్లీలో మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో కాంట్రాక్ట్ మరియు ఔట్సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న ఉద్యోగులకు నాలుగో తరగతి 15,600 ఇస్తున్నారని తెలియజేశారు. అది ఎవరికి ఇస్తున్నారు అర్థం కావట్లేదని తక్షణమే ఎన్ హెచ్ ఎం నాలుగవ తరగతి ఉద్యోగులకు అందరికీ వర్తింపజేసేలా చూడాలని డిప్యూటీ చీఫ్ మినిస్టర్ నీ మరియు ముఖ్యమంత్రివర్యులు ఎనుముల రేవంత్ రెడ్డిని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నామని
ఎన్ హెచ్ ఎం కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ (ఏఐటియుసి అనుబంధం) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ రాజేష్ ఖన్నా ప్రభుత్వాన్ని మీడియా ద్వారా పరిష్కరించాలని కోరుతున్నాము.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

4 months of pending wages should be paid immediately

You cannot copy content of this page

Scroll to Top