జూన్ 26, 2026
TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్, ( కొయ్యూరు ) అల్లూరిజిల్లా, కొయ్యూరు మండలం, నల్లగొండ మరియు రావణాపల్లి పంచాయతీ లలో పంచాయతీ కార్యదర్శి జి. అప్పారావు ఆధ్వర్యంలో జన జాతీయ గౌరవ్ వర్ష్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. దీనిలో భాగంగా దర్తీఆబజన్ భాగిదారి అభియాన్ అవేర్న్ స్ మరియు బెనిఫిట్ స్యాచురేషన్ క్యాంప్ ఈ నెల 15 నుండి 30 వ తారీఖు వరకు నిర్వహించడం జరుగుతుంది. దీనిలో భాగంగా నల్లగొండ మరియు రావణాపల్లి పంచాయతీలలో నిర్వహించడం జరిగింది. అలాగునే ఆధార్ కార్డులు, బ్యాంక్ అకౌంట్స్, హెల్త్ కార్డ్స్ లపై వాటి యొక్క ఉపయోగాలపై గ్రామస్తులకు అవహగాహన పరిచారు. మరియు సికిల్ సెల్ ఎనీమియా పరీక్షలు, మొదలగు కార్యక్రమాలు చేయటం జరిగింది.

ఈ కార్యక్రమంలో సర్పంచ్ జె. రాజకుమారి, వార్డు నెంబర్లు ఎస్. కృష్ణబాబు, కె. దేవికుమారి, సచవాలయ సిబ్బంది, వెల్పేర్ అసిస్టెంట్ రామకృష్ణ, ఇంజనీరింగ్ అసిస్టెంట్ సోమరాజు, మహిళా పోలీస్ రమణమ్మ, వెటర్నరీ అసిస్టెంట్ శివ కుమార్, డిజిటల్ అసిస్టెంట్ గౌతమి, ఎఎన్ ఎమ్ తలుపులమ్మ, పీసా కమిటీ అధ్యక్షుడు ఎస్. శ్రీనుబాబు, గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

"Jana Jatiya Gaurav Varsh"

You cannot copy content of this page