Disciplined Education : క్రమశిక్షణతో కూడిన విద్య

TRINETHRAM NEWS

తేదీ : 24/06/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్): ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పోలవరం నియోజకవర్గం, కుక్కునూరు మండలంలో ఉన్నటువంటి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు మరియు మండల ప్రజాపరిషత్ , జిపిఎస్ పాఠశాల లో విద్యార్థులకు క్రమశిక్షణతో కూడిన విద్యాబోధన, మరియు డొక్కా సీతమ్మ మధ్యాహ్నం భోజనం పథకం భాగంలో సన్న బియ్యం అన్నము, కూరగాయలు, ఆకుకూరలు, పప్పు వంటి పౌష్టిక ఆహారం, అందులో భాగంగానే రోజు విడిచి రోజు బెల్లం వేరుశెనగ గింజలతో తయారుచేసినటువంటి చిక్కిలు, రాగి జావా మొదలైనవి అందించడం జరుగుతుంది. ప్రభుత్వ సమయం ప్రకారం పాఠశాలలు తెరవడం, తరగతులు మరియు, ఆటలు మొదలైనవి నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ప్రతి పాఠశాలలో మొత్తం విద్యార్థులు ఎంతమంది ఉన్నారో చెప్పడం జరిగింది. అదేవిధంగా కొత్త అడ్మిషన్లకు సంబంధించి వివరణలు పేర్కొన్నారు. ఇసుకపాడు, ప్రధానోపాధ్యాయులు యస్. వెంకటేశ్వరరావు, లంకలపల్లి.
జి. వెంకటేశ్వర్లు, కివ్వాక.యం. భీమరాజు, కొండపల్లి కె. ముత్తమ్మ, మారేడు బాక.బి. ప్రవీణ్, చీరవల్లి. జీవి సుబ్బారావు, మర్రిపాడు ఎ. దుర్గారావు, ఎల్లప్పగూడెం. వెంకటరమణ, దామరచర్ల, యస్. వెంకటనారాయణ విద్యార్థులు మరియు ప్రధానోపాధ్యాయులు , ప్రజలందరూ కూడా కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారని చెప్పారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు యం.యస్ శ్రీనివాస్ మాట్లాడుతూ పదవ తరగతి పబ్లిక్ పరీక్షల్లో అరవై మూడు శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించాలని తెలపడం జరిగింది. అదేవిధంగా చీరపల్లి పాఠశాలలో దాసరి .అక్షయ్ ఐదు వందల పద్నాలుగు మార్కులతో ప్రథమ స్థానాన్ని గెలిసాడని పేర్కొన్నారు. నందిని నాలుగు వందల తొంబై మార్కులతో ద్వితీయ స్థానాన్ని సాధించింది అని తెలిపారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Disciplined education

You cannot copy content of this page

Scroll to Top