బీసీలపై జగన్ రెడ్డి కపట ప్రేమ

TRINETHRAM NEWS

తేదీ.12.12.2023

//పత్రికా ప్రకటన//

▪️ సిట్టింగ్ ల మార్పులతో ఓటమి భయం పట్టుకున్న జగన్మోహన్ రెడ్డి …..

▪️ బీసీలపై జగన్ రెడ్డి కపట ప్రేమ

జగన్ రెడ్డికి ఓటమి భయం పట్టుకుందని అందుకే అభ్యర్థులను మారుస్తున్నారని ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు డాక్టర్ నూకసాని బాలాజీ పత్రికా ప్రకటన ద్వారా విమర్శించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిన్న వైసీపీ ప్రకటించిన 11 మంది ఇంచార్జుల్లో ఒక్కరూ కూడా గెలిచే పరిస్థితి లేదని, ఒక నియోజకవర్గం నుంచి మరో నియోజకవర్గానికి నాయకులను మార్చినంత మాత్రాన జగన్ రెడ్డి తలరాత మారదు అని అన్నారు.

▪️వైఎస్సార్‌సీపీ 11 మంది ఇంచార్జుల్లో ముగ్గురు మంత్రులు ఉన్నారని, స్థానికంగా వారిపైన వ్యతిరేఖత, అవినీతి ఆరోపణలు, ప్రజలతో సత్ సంబంధాలు లేకపోవడమే ఇందుకు కారణమని, ప్రజలను మరోసారి మోసం చేసేందుకు వైఎస్సార్‌సీపీ ఇంచార్జుల మార్పుల పేరుతో కొత్త నాటకం ఆడుతోందని తెలిపారు.

దగాకోరు జగన్ రెడ్డి పాపం పండిందని జగన్ రెడ్డి అవినీతి, అక్రమాలు పైన ఇప్పటికే ప్రజలు పీకలు దాకా కోపంతో ఉన్నారని అన్నారు.

▪️జగన్ రెడ్డి ఇంచార్జులను మారుస్తున్నారు కానీ ఏపీ ప్రజలు ఏకంగా జగన్ రెడ్డినే మార్చేందుకు సిద్దంగా ఉన్నారని అన్నారు.

▪️ ఇప్పటి వరకు వైసీపీ నాయకులు చేసినదంతా ఆంధ్ర ప్రదేశ్ ప్రజలను దోచుకోవడం, వారిని భవిష్యత్తును అంధకారంలోకి నెట్టివేయడం జరిగిందని, మూడు రాజధానుల పేరుతో రాష్ట్రవ్యాప్తంగా నాటకాలు ఆడటం తప్పా ఈ వైసీపీ ప్రభుత్వం అభివృద్ధి చేసినది ఏమిలేదని అంతా శూన్యమే అని అన్నారు.

▪️ మంగళగిరిలో గెలుస్తారని తెలిసినప్పుడు సీటు రెడ్డి సామాజిక వర్గానికి ఇచ్చి ఓడిపోతారు అని తెలిసినప్పుడు మాత్రం బీసీ సామాజిక వర్గానికి చెందిన గంజి చిరంజీకి ఇచ్చారని, బీసీల మీద జగన్ రెడ్డికి ఉన్న కపట ప్రేమకు ఇదే నిదర్శనమని అన్నారు.

తెలుగుదేశం పార్టీ కల్పిస్తున్న భవిష్యత్తుకు గ్యారెంటీతో వచ్చే ఎన్నికల్లో జగన్ రెడ్డిని ప్రజలు చిత్తుగా ఓడించి ఇంటికి పంపడం కూడా గ్యారెంటీ అని ఈ సందర్భంగా తెలియజేశారు.

ఇట్లు:-,
ప్రకాశం జిల్లా తెదేపా కార్యాలయం,
భాగ్యనగర్, ఒంగోలు.

You cannot copy content of this page

Scroll to Top