పాడేరు నియోజకవర్గం నుంచి భారీగా తరలివెళ్లే ఏర్పాట్లు. వంపూరు గంగులయ్య
ఆంధ్రప్రదేశ్ త్రినేత్రం న్యూస్ (అమరావతి) ఏప్రిల్ 2: రాష్ట్ర రాజధాని అమరావతిలో మే 2 (బుధవారం)న పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయడానికి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విచ్చేస్తున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేయబోయే బహిరంగ సభను ఘనవంతం చేసేందుకు ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి.
మోడీ సభను విజయవంతం చేయడం కోసం పాడేరు నియోజకవర్గానికి ప్రత్యేకంగా 12 బస్సులు కేటాయించారు. ప్రతి మండలం నుంచి రెండు బస్సుల చొప్పున ఈ ఏర్పాట్లు చేపట్టారు. బస్సుల బాధ్యతను తెలుగుదేశం పార్టీ మండలాధ్యక్షులకు అప్పగించారని, జనసేన పార్టీ మండలాధ్యక్షులు తమ్ముళ్లతో సమన్వయం చేసుకొని కూటమి నేతలు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో సభకు తరలివెళ్లేలా చర్యలు తీసుకోవాలని పాడేరు అసెంబ్లీ–అరకు పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జ్ వంపూరు గంగులయ్య విజ్ఞప్తి చేశారు.
“మోడీ నేతృత్వంలో దేశ అభివృద్ధికి నాంది పలుకుతున్న వేళ, రాజధాని అమరావతి పునర్నిర్మాణానికి మొదటి అడుగు పడుతున్న ఈ చారిత్రక సందర్భంలో, ప్రతి ఒక్కరమూ పాల్గొని సభను విజయవంతం చేయాలని కోరుతున్నాం” అని ఆయన పేర్కొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


