Vampuru Gangulaiah Demands : జీవో నెంబర్ 3కు ప్రత్యామ్నాయం చూపండి: గిరిజనుల కోసం స్పెషల్ డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయండి

TRINETHRAM NEWS

ఆంధ్రప్రదేశ్ త్రినేత్రం న్యూస్ మంగళగిరి, మే 1: ఆంధ్రప్రదేశ్ గిరిజన నిరుద్యోగ యువతకు న్యాయం చేయడంలో ప్రభుత్వం పాశవికంగా విఫలమైందని విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో, జీవో నెంబర్ 3ను పునరుద్ధరించాల్సిన అవసరం ఉందని జనసేన పార్టీ పాడేరు అసెంబ్లీ మరియు అరకు పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జ్ డాక్టర్ వంపూరు గంగులయ్య పేర్కొన్నారు.
తెలుగుదేశం పార్టీ మంగళగిరి కేంద్ర కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమంలో రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్‌కు గంగులయ్య వినతి పత్రం అందజేశారు. జీవో నెంబర్ 3కు ప్రత్యామ్నాయం చూపించాలని, గిరిజన యువత కోసం ప్రత్యేక డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ గంగులయ్య, 2017లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారం లో ఉన్నప్పుడు మాత్రమే డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలైందని, వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ ఐదేళ్ల పాలనలో ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదని తీవ్రస్థాయిలో విమర్శించారు.నారా చంద్రబాబు నాయుడు అరకులో నిర్వహించిన “రా కదలిరా” సభలో జీవో నెంబర్ 3ను పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తుచేసిన గంగులయ్య, ఇప్పుడు అది నెరవేరే సమయం వచ్చిందని అన్నారు.
జీవో నెంబర్ 3పై కొందరు వ్యక్తులు సుప్రీంకోర్టును ఆశ్రయించగా, దాన్ని రద్దు చేయడం వల్ల గిరిజన నిరుద్యోగ యువత తీవ్రంగా నష్టపోయిందని, ఆ సమయంలో వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం కోర్టులో వాదనలు వినిపించకుండా నిర్లక్ష్యం చేసినట్టు ఆరోపించారు. జీవోను పునరుద్ధరించేందుకు చట్టసభలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాలన్న మార్గాన్ని కూడా విస్మరించిందని గంగులయ్య ఆరోపించారు.
ఇప్పటి శాసనసభలో ఉన్న ఎస్టీ కమిషన్ మాజీ సభ్యులు గిరిజన హక్కుల విషయంలో మౌనం పాటించడం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు. రాజకీయ లబ్ధి కోసమే గిరిజన సమస్యలను నిర్లక్ష్యం చేయడం బాధాకరమని విమర్శించారు.
డీఎస్సీ కోసం ఎదురుచూస్తున్న వేలాదిమంది గిరిజన నిరుద్యోగ యువత ఆకాంక్షలకు రాజకీయ రంగులు అల్లడం తగదని గంగులయ్య పేర్కొన్నారు. ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ అంశంపై సానుకూల దృష్టి సారించారని, త్వరలోనే తీపి కబురు వచ్చే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు.
“జీవో నెంబర్ 3 పునరుద్ధరణ లేదా సమానమైన ప్రత్యామ్నాయంతో గిరిజనులకు న్యాయం జరిగేలా అంతా ఐక్యంగా కృషి చేయాలి” అని గంగులయ్య పిలుపునిచ్చారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Show an alternative to

You cannot copy content of this page

Scroll to Top