జూన్ 26, 2026

WhatsApp Image 2025 01 30 at 19.36.29

TRINETHRAM NEWS

భారత రాజ్యాంగాన్ని రక్షించుకునే బాధ్యత ప్రతి ఒక్కరిది.

తేదీ : 30/01/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్) ; ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , ముసునూరు పార్టీ కమిటీ సమావేశంలో అఖిల భారత కిషన్ మహాసభ జరిగింది. ప్రమాదంలో భారత రాజ్యాంగం .కామ్రేడ్ దీపాంకర్ భట్టాచార్య భారత రాజ్యాంగం తీవ్ర ప్రమాదంలో పడిందని దానిని రక్షించుకోవాల్సిన బాధ్యత వామపక్ష ప్రజాతంత్ర వ్యక్తులపై ఉన్నదని సి.పి.ఐ. యం.యల్ ప్రధాన కార్యదర్శి అనడం జరిగింది. మండల అధ్యక్షులు పామర్తి.

రామారావు, కార్యదర్శి మేడూరి సర్వీసు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో పార్టీ మండల కార్యదర్శి వేముల బక్కయ్య తెలియజేస్తూ, భట్టాచార్య మాట్లాడుతూ కేంద్రంలో నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం వివాదాస్పద మందిరాల సమస్యను తెరపైకి తెచ్చి విద్వేషాలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తుందని ధ్వజమెత్తారు. హామీలు అమలు చేయడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని మండిపడడం జరిగింది.
హామీలు అమలకు కలిసికట్టుగా ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని చెప్పారు. పంటలకు కనీస మద్దతు ధర
కార్మిక వర్గానికి కనీస వేతనాలు , ఉద్యోగ భద్రతను కల్పించడంలో మోదీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. విద్య ఆరోగ్యం వంటి విషయాలు సామాన్య ప్రజలకు అందుబాటులో లేకుండా పోయాయని ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది.

సూపర్ సిక్స్ పేరుతో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలను మోసం చేస్తున్నారని భారత కమ్యూనిస్టు పార్టీ శతజయంతి సందర్భంగా దేశంలోనూ , ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ , సి.పి.ఐ. యం. యల్ పార్టీ కృషి చేస్తుంది అని అన్నారు. అదేవిధంగా అంబానీ ఆదాయం పెరుగుదల శూన్యమని పార్టీ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ దీపాంకర్ భట్టాచార్య పేర్కొన్నారని, అక్కయ్య తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మేడూరు స్వర్ణకుమారి, పల్లి పాము భవాని తదితరులు పాల్గొనడం జరిగింది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page