WhatsApp Image 2025 01 30 at 20.20.56
ఎమ్మెల్సీ ఎన్నికల పై సమీక్ష నిర్వహించిన జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష
పెద్దపల్లి, జనవరి-30: త్రినేత్రం న్యూస్ ప్రతినిధి, శాసన మండలి సభ్యులు ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో జిల్లాలో ఎన్నికల ప్రవర్తన నియమావళిని కట్టుదిట్టంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు.
గురువారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సమీకృత జిల్లా కలెక్టరేట్ లో ఎమ్మెల్సీ ఎన్నికల పై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ, ఉమ్మడి కరీంనగర్ , నిజామాబాద్ మెదక్, ఆదిలాబాద్ పట్టభద్రులు, టీచర్స్ శాసన మండలి సభ్యుల స్థానానికి ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసిందని అన్నారు.
ఫిబ్రవరి 3న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అవుతుందని, ఫిబ్రవరి 10 వరకు నామినేషన్ల స్వీకరణ, ఫిబ్రవరి 11న స్క్రూట్ ని ఫిబ్రవరి 13 లోపు ఉపసంహరణ గడువు ఉంటుందని, ఫిబ్రవరి 27న పోలింగ్ జరుగుతుందని, మార్చి 3న ఫలితాలు ఉంటాయని కలెక్టర్ తెలిపారు.
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నేపథ్యంలో పెద్దపల్లి జిల్లాలో ఎన్నికల ప్రవర్తన నియమావళి కట్టుదిట్టంగా అమలు చేయాలని, రాజకీయ పార్టీలకు సంబంధించిన హోల్డింగులు, వాల్ రైటింగ్ లు, జెండాలు, ప్రకటనలు తొలగించాలని,ఎన్నికల ప్రవర్తన నియమావళి నిబంధనలను పూర్తి స్థాయిలో అమలు చేయాలని అధికారులకు కలెక్టర్ ఆదేశించారు.
ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి కౌంటింగ్ బృందాలు, ఎంసిసి బృందాలు, ఫ్లైయింగ్ స్క్వాడ్, వీ.ఎస్.టి , వీ.వి.టి మొదలగు బృందాలను వెంటనే ఏర్పాటు చేయాలని కలెక్టర్ తెలిపారు. మండలాల్లో పెండింగ్ ఉన్న పట్టభద్రులు, టీచర్స్ ఓటర్ నమోదు దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. పోలింగ్ కేంద్రాలను తహసీల్దార్లు పరిశీలించాలని అన్నారు.
గురుకులాలలో ప్రవేశాలకు సంబంధించి ఆన్లైన్ అడ్మిషన్ లు ఫిబ్రవరి 1 చివరి తేదీ ఉన్నందున విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా తాహసిల్దార్ ల వద్ద పెండింగ్లో ఉన్న ఆదాయ, కుల, నివాస, సర్టిఫికెట్లు ఈనెల 31 లోపు పూర్తిచేయాలని ఆదేశించారు.
ఈ సమావేశంలో రెవెన్యూ డివిజన్ అధికారులు గంగయ్య ,సురేష్, తహసిల్దార్లు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
