అల్లూరి జిల్లా అరకులోయ ఫిబ్రవరి 15, (త్రినేత్రం న్యూస్): 2026-27 రాష్ట్ర బడ్జెట్‌లో షెడ్యూల్డ్ ట్రైబ్స్ కాంపోనెంట్ (ఎస్టీ సబ్ ప్లాన్)కు రూ. 9,190 కోట్లు కేటాయించారు. ఇది మునుపటి సంవత్సరం 2025-26లో కేటాయించిన రూ. 8,159 కోట్లతో పోలిస్తే సుమారు 12.6% పెరుగుదల. మొత్తం రాష్ట్ర బడ్జెట్ రూ. 3,32,205 కోట్లు కాగా, రెవెన్యూ వ్యయం రూ. 2,56,143 కోట్లు, క్యాపిటల్ వ్యయం రూ. 53,915 కోట్లుగా ఉందని ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పొద్దు బాలదేవ్ మండల కార్యదర్శి జి బుజ్జిబాబు మండల నాయకులు దశరథ్ అన్నారు.
అరకువేలి గిరిజన సంఘం భవనంలో ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పొద్దు బాలదేవ్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఆదివాసీ జనాభా సుమారు 5.3% (2011 జనగణన ప్రకారం, సుమారు 26.4 లక్షలు) ఉన్నప్పటికీ, ఈ కేటాయింపు అసమానంగా, అపర్యాప్తంగా ఉంది. జనాభా నిష్పత్తి ప్రకారం ఎస్టీ సబ్ ప్లాన్‌కు కనీసం రూ. 17,600 కోట్లు కేటాయించాలి.
కానీ, ప్రభుత్వం దీనిని 2.77% మాత్రమే కేటాయించి, ఆదివాసీల సంక్షేమాన్ని పట్టించుకోలేదని ఇది ప్రజా సంక్షేమం, సామాజిక న్యాయానికి వ్యతిరేకంగా ఉందని విద్యా రంగంలో ఆదివాసీలకు ప్రత్యేక కేటాయింపులు లేవని ఆదివాసీ పాఠశాలలు, వసతి గృహాలకు ప్రత్యేక నిధులు స్పష్టంగా ప్రకటించలేదని ఆదివాసీ ప్రాంతాల్లో ఆరోగ్య సేవలు, మొబైల్ మెడికల్ యూనిట్లకు అదనపు నిధులు లేవని వ్యవసాయం, గ్రామీణాభివృద్ధిలో ఆదివాసీ రైతులకు గిట్టుబాటు ధరలు, పంటల బీమా, ఇరిగేషన్ ప్రాజెక్టులకు ప్రత్యేక దృష్టి లేదని ఇరిగేషన్ రంగంలో వంశధార, వెలిగొండ వంటి ప్రాజెక్టులకు అదనపు నిధులు కేటాయించకపోవడం వల్ల ఆదివాసీ ప్రాంతాలు వెనుకబడుతున్నాయి.
నిరుద్యోగ భృతి, మహిళల సంక్షేమం వంటి సూపర్ సిక్స్ పథకాల్లో ఆదివాసీలకు ప్రత్యేక ప్రాధాన్యత లేదని ఆదివాసీ కాఫీ రైతుల ప్రస్తావన లేదని పీవీటీజీలకు పీఎం జన్మన్ హౌసింగ్ కు రాష్ట్ర ప్రభుత్వం పెంచిన లక్ష రూపాయలు ఎప్పటికీ చెల్లిస్తారో స్పష్టత లేదని ఈ బడ్జెట్ ఆదివాసీల అభివృద్ధికి తోడ్పడే విధంగా లేదని అరకు వంటి వెనుకబడిన ఆదివాసీ ప్రాంతాలకు ప్రత్యేక నిధులు, కాఫీ, అటవీ ఉత్పత్తుల పరిశ్రమలు లేకపోవడం హాస్యాస్పదం. ప్రభుత్వం “వికసిత ఆంధ్రప్రదేశ్” అంటున్నా, ఆదివాసీల సంక్షేమం శూన్యం. కేంద్రం నుండి రావాల్సిన గ్రాంట్లు తగ్గడం, అప్పుల భారం పెరగడం వల్ల ఆదివాసీలపై అదనపు భారం పడుతుందని
ఈ బడ్జెట్‌ను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు ఆదివాసీల హక్కులు, సంక్షేమం కోసం పోరాడుతామని ప్రభుత్వం ఆదివాసీల అవసరాలు పరిగణనలోకి తీసుకుని అదనపు నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


