Iran Responds to Trump’s Comments : హార్ముజ్ జలసంధిపై ఇరాన్ హెచ్చరిక… ట్రంప్ వ్యాఖ్యలకు ఇరాన్ కౌంటర్

TRINETHRAM NEWS

Trinethram News : మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు పెరుగుతున్న వేళ అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలకు ఇరాన్ ఘాటుగా స్పందించింది..

హార్ముజ్ జలసంధి నుంచి ఆయిల్ సరఫరాను అడ్డుకుంటే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ట్రంప్ హెచ్చరించిన నేపథ్యంలో, ఇరాన్ కూడా కఠినంగా స్పందిస్తూ అవసరమైతే ఆ మార్గంలో ఒక్క చుక్క ఆయిల్ కూడా బయటకు వెళ్లకుండా అడ్డుకుంటామని స్పష్టం చేసినట్లు సమాచారం..

ఇజ్రాయెల్, అమెరికా దాడులు కొనసాగితే ఆయిల్ రవాణాను లక్ష్యంగా చేసుకునే అవకాశముందని కూడా హెచ్చరికలు వెలువడుతున్నాయి. అమెరికా సైనిక స్థావరాలు ఉన్న గల్ఫ్ ప్రాంత దేశాలు కూడా ఈ పరిస్థితులను గమనిస్తున్నట్లు తెలుస్తోంది..

ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు పెరుగుతున్న సమయంలో ఈ వ్యాఖ్యలు మరింత ఆందోళనకు కారణమవుతున్నాయి…

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Iran responds to Trump's comments

You cannot copy content of this page

Scroll to Top