Iran War : ఇరాన్ యుద్ధం కడియం నర్సరీ రైతులపై ధరల బాంబు

TRINETHRAM NEWS
Iran War Kadiyam Nursery Farmers Hit

Iran War : త్రినేత్రం న్యూస్, కడియం,: తూర్పుగోదావరి జిల్లా కడియం మండలంలోని నర్సరీ రైతులు మొక్కల కవర్ల ధరలు ఒక్కసారిగా పెరగడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కడియం ప్రాంతంలో ఉన్న కవర్ల ఫ్యాక్టరీలు, షాపుల వారు మొక్కల కవర్ల బస్తాల ధరలను అమాంతం పెంచారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా కడియం ప్రాంతంలో కవర్ల ఫ్యాక్టరీ యజమానులు కృత్రిమ కొరత సృష్టించి ధరలను పెంచుతున్నారని నర్సరీ రైతులు ఆరోపించారు. దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరగకపోయినా, ఇరాన్ యుద్ధాన్ని కారణంగా చూపుతూ కవర్ల ధరలు పెంచి రైతులను మోసం చేస్తున్నారని వారు తెలిపారు.
ఈ సమస్యను రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ దృష్టికి నర్సరీ రైతులు తీసుకెళ్లి వినతిపత్రం సమర్పించారు. కవర్ల ధరల పెరుగుదల వల్ల నర్సరీ వ్యవసాయం నిర్వహించడం కష్టంగా మారిందని, ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని ధరలను నియంత్రించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. రైతుల సమస్యపై మంత్రి కందుల దుర్గేష్ సానుకూలంగా స్పందించి, నర్సరీ రైతులకు మేలు జరిగేలా తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ పుల్లా రామారావు, మల్లు శివ, పాటంశెట్టి వాసు, అడ్డగళ్ల రమేష్, సుంకర గోవిందు, అన్నందేవుల బాబి, తాళం నరేష్ తదితరులు ఉన్నారు.

You cannot copy content of this page

Scroll to Top