జూన్ 26, 2026
TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ పెనుమూరు. గంగాధర నెల్లూరు నియోజకవర్గం పెనుమూరు మండలం లోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో యోగా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం మెడికల్ ఆఫీసర్ ఆధ్వర్యంలో జరిగింది. వారు మాట్లాడుతూ యోగా ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది, శారీరిక శక్తిని, మనస్సుకు ప్రశాంతతను చేకూరుస్తుందని అన్నారు. ప్రపంచానికి భారత్ అందించిన గొప్ప వరం యోగా అన్నారు. యోగా అంటే జీవిత విధానాన్ని జీవిత క్రమశిక్షణను నేర్పుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సిహెచ్సి స్టాప్ డాక్టర్ గీత కుమారి, డాక్టర్ త్రీ లోకనాథ్, డాక్టర్ కృష్ణ సుధా, డాక్టర్ జోష్ణ, మరియు హెడ్ నర్స్ నిర్మలాదేవి ఆసుపత్రి సిబ్బంది, రోగులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

International Yoga Day at

You cannot copy content of this page