Trinethram News : Jun 29, 2025, ఆంధ్రప్రదేశ్ : తిరుమలకు వచ్చే భక్తులకు భవిష్యత్తులో బీమా సదుపాయం కల్పించే యోచనలో టీటీడీ ఉన్నట్లు తెలుస్తోంది. అలిపిరి మెట్ల మార్గం, క్యూలైన్లలో రద్దీ తదితర కారణాలతో ఏదైనా ప్రమాదం జరిగితే బాధితులకు పరిహారం చెల్లించే విధంగా ప్లాన్ చేస్తోంది. ప్రస్తుతం తిరుమలలో ప్రమాదానికి గురై మృతి చెందిన వారికి టీటీడీ రూ.3 లక్షల వరకు చెల్లిస్తోంది. అయితే తిరుమలకు రోజూ భారీ సంఖ్యలో భక్తులు వస్తుంటారు. ఈ నేపథ్యంలో బీమా అమలు సాధ్యాసాధ్యాలపై పరిశీలిస్తున్నట్లు తెలిసింది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


