MLA Jare : ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశం ముమ్మరం : వర్షంలోనూ పర్యవేక్షిస్తున్న ఎమ్మెల్యే జారే

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలంలోని బెండలపాడు గ్రామంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమానికి హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో అశ్వారావుపేట శాసనసభ్యులు జారే ఆదినారాయణ, తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగ సీతారాములు, చండ్రుగొండ మండల కాంగ్రెస్ నాయకులు వర్షాన్ని సైతం లెక్కచేయకుండా సభా ప్రాంగణాన్ని పరిశీలించారు.

ఈ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను వారు సమీక్షించారు. మరియు బెండలపాడు కు వెళ్లే దారిలో జరుగుతున్న డ్రైనేజీ పనులను ఎమ్మెల్యే జారే ఆదినారాయణ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు,పాల్గొన్నారు. ప్రజల సౌకర్యార్థం చేపడుతున్న పనులను ఆయన సమీక్షించారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Indiramma's housewarming in full swing

You cannot copy content of this page

Scroll to Top