త్రినేత్రం న్యూస్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. దమ్మపేట మండలం మల్లారం కాలనీలో రోడ్డు సరిగా లేక ప్రజలు, ముఖ్యంగా మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పిల్లలు పాఠశాలలకు వెళ్ళేటప్పుడు పడుతున్న కష్టాలను తట్టుకోలేక మహిళలు రోడ్డు ఎక్కారు. ఎమ్మెల్యే ఒక్క రోడ్డుకు మాత్రమే శంకుస్థాపన చేయడంపై సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ పార్టీ నాయకురాలు గంగాధర్ నాగమణి అసంతృప్తి వ్యక్తం చేశారు. గత ప్రభుత్వాలు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని, కాలనీ రోడ్లన్నీటిని బాగు చేయాలని పార్టీ నాయకుడు పండూరి వీరబాబు డిమాండ్ చేశారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


