Indiramma’s houses : అందని ద్రాక్షలా మారిన ఇందిరమ్మ ఇండ్లు

TRINETHRAM NEWS

ప్రభుత్వాలు మారినా నిరుపేదల బ్రతుకులు మారక పాయే.

పాలకులకు ఎన్నికలప్పుడు మాత్రమే ఓట్లకోసం గుర్తుకు వస్తారా మిగితా సందర్భాలలో గుర్తుకురారా…….
డిండి (గుండ్ల పల్లి) జూలై 05 త్రినేత్రం న్యూస్. పేదింటి కల కలగానే మిగిలిపోయింది.ఇండ్లు ఉన్నవారికే ఇందిరమ్మ ఇండ్లు , నిరుపేదలకు గుండు సున్నా?. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని, ఇచ్చిన హామీలు నెరవేరుస్తామని, చెప్పి ఇప్పుడు పేద వారికి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వకుండా నాయకులకు మరియు అనుచరులకు మాత్రమే ఇస్తున్నారు, పేదవారు ఎప్పుడు పేదవారి లాగానే ఉండాలా? ఎన్ని ప్రభుత్వాలు మారినా మా బతుకులు మాత్రం మారడం లేదని విమర్శలు వెలువెత్తుతున్నాయి.
డిండి మండల కేంద్రంలోనీ డిఎన్టి కాలనీకి సమీపాన ఉన్న బేడ బుడగ జంగాల కాలనీ లో ఇప్పటివరకు ఎలాంటి అభివృద్ధి పథకాలకు నోచుకోలేదని కాలనీవాసులు వాపోతున్నారు. కాలనీలో రోడ్లు, మరియు మంచినీటి సౌకర్యం కూడా సరిగా లేదని, చిన్నపాటి వర్షానికి ఇండ్లలోకి వర్షం నీరు వస్తుందని, దోమల బెడద, కోతుల బెడద ఉందని అధికారులు ఎవరూ పట్టించుకోవడంలేదని, దోమలు ఎక్కువగా ఉండటం వల్ల ప్రజలు డెంగీ జ్వరాలకు బారిన పడి హాస్పిటల్ చుట్టూ తిరగాల్సి వస్తుందని అంటున్నారు.
పొట్ట కూటికోసం ఉదయం బయలుదేరి రాత్రికి రాగానే కరెంటు సరిగ్గా లేకపోవడంతో దోమలతో నరకయాతన అనుభవిస్తున్నారని అంటున్నారు. రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి మాదని మా బ్రతుకుల్లో వెలుగులు నింపాలనిఅధికారులకు విన్నవించుకుంటున్నారు. ప్రజా పాలనలో ఇందిరమ్మ రాజ్యంలో అధికారులు, మాజీ ప్రజా ప్రతినిధులు స్పందించి కాలనీలో నెలకొన్న సమస్యలను ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయించాలని గ్రామపంచాయతీ కార్యాలయం ముందు నిరసన తెలిపి వినతి పత్రం ఇచ్చారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Indiramma's houses have become

You cannot copy content of this page

Scroll to Top