Orsu Mutyalu : రోడ్ల నిర్మాణం చేయరా?

TRINETHRAM NEWS

కంకర పోశారు, బీటీ వేయడం మరిచారు…
కంకర వేసి మూడు నెలలు దాటుతున్న రోడ్డు వేయని పరిస్థితి.
కాంట్రాక్టర్లకు బిల్లులు వెంటనే చెల్లించి రోడ్డును త్వరగా పూర్తి చేయాలి.
బి ఆర్ ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు ఓర్సు ముత్యాలు.
డిండి (గుండ్ల పల్లి ) జూలై 05 త్రినేత్రం న్యూస్. నల్గొండ జిల్లా డిండి మండలంలోని మన గ్రామా లకు బిటి రోడ్లు మంజూరు కావడం జరిగింది. ఇందులో భాగంగా గద్వాల్ తండా వావిల్ కోల్ వడ్డెర గూడెం దాస్య తండా సోమల తండా బొగ్గుల దొన గ్రామాలకు బిటి రోడ్లు మంజూరు అయ్యాయి కానీ ఎక్కడా వేసిన గొంగడి అక్కడే ఉన్న చందంగా కేవలం కంకర డస్ట్ పోసి వదిలేశారు. దీని తో వాహనదారులు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
వానాకాలం కావడంతో వాన వస్తే డస్ట్ మొత్తం బురదలాగా మారి రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతుందని వాహనదారులు వాపోతున్నారు. సదరు కాంట్రాక్టర్ లను అడిగితే రాకపోవడంతోనే వీటిని పరిస్థితి నెలకొందని వాపోతున్నారు. ఇప్పటిక ైనా ప్రజలు వాహనదారుల సౌకర్యార్థం వీలైనంత త్వరగా బీటి రోడ్డు నిర్మించాలని కోరుతున్నారు.
కాంటాక్ట్లకు బిల్లులు చెల్లించి త్వరగా రోడ్ల నిర్మాణం చేయాలని మండలంలో అర్ధాంతంగా మిగిలిపోయిన రోడ్లకు బిటిని నిర్మాణం చేయాలని అదే తరు ణంలో సంబంధిత కాంట్రాక్టర్లకు వెంటనే చెల్లించాలని బిఆర్ఎస్ పార్టీ వావిల్ కోల్ వడ్డెర గూడెం గ్రామ శాఖ అధ్యక్షులు ఓర్సు ముత్యాలు సంబంధిత అధికారులను, ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Will the roads be

You cannot copy content of this page

Scroll to Top