ప్రజాపాలనలో ప్రజలకు ప్రభుత్వ పథకాలు అందాలి…
సిపిఐ డిండి మండల మహాసభను జయప్రదం చేయండి…
సిపిఐ మండల కార్య వర్గ సమావేశంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పల్లా నరసింహారెడ్డి.
డిండి (గుండ్ల పల్లి) జూన్ 25 త్రినేత్రం న్యూస్. అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇండ్లను ఇవ్వాలని ఎల్ 1,ఎల్ 2, ఎల్ 3,ఎల్ 4, వంటి నిబంధనలు చూడకుండా అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇళ్లను ప్రభుత్వం కేటాయించాలని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పల్లా నర్సింహా రెడ్డి అన్నారు.బుధవారం డిండి మండల సిపిఐ కార్యవర్గ సమావేశానికి ముఖ్యఅతిధిగా హాజరైన నర్సింహా రెడ్డి మాట్లాడుతూ…
అభివృద్ధి సంక్షేమం దిశగా ప్రభుత్వ పథకాలు ప్రజా పాలనలో ప్రజలందరికీ చేరువవ్వాలని,అర్హులైన ప్రతి ఒక్కరు ప్రభుత్వ పథకాలను పొందేలా ప్రభుత్వం, అధికారులు ఆచరణలో అమలు చేయాలని అన్నారు. వీలైనంత త్వరగా
డిండి లిఫ్ట్ ఇరిగేషన్ పనులను పూర్తి చేసి రైతాంగానికి సాగునీరు అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ)డిండి మండలం 15వ, మహాసభలు జూన్ 29న, డిండి మండల కేంద్రంలోని ఎలకుర్తి జైపాల్ గార్డెన్ లో జరగనున్నాయని అన్నారు.ఈ మహాసభల విజయవంతానికి పార్టీ శ్రేణులు తరలిరావాలని నర్సింహా రెడ్డి పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు బొడ్డుపల్లి వెంకటరమణ,జిల్లా సమితి సభ్యులు తూం బుచ్చిరెడ్డి,రైతు సంఘం జిల్లా అధ్యక్షులు ఎండి.మైనొద్దీన్, సిపిఐ మండల కార్యదర్శి శ్రీరామదాసు కనకాచారి, మండల సహాయ కార్యదర్శి బొల్లె శైలేష్,తిప్పర్తి విజేందర్ రెడ్డి,కార్యవర్గ సభ్యులు హనుమండ్ల కేశవులు,ఎలిమినేటి హుస్సేన్,సోమిడి శ్రీనయ్య,నూనె వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


