వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ పరిగి మండలం, రంగం పల్లి గ్రామానికి చెందిన 1-00 ప్రభుత్వ భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసిన,ప్రభుత్వ సీలింగ్ భూమిని అక్రమార్కులకు కట్టబెట్టిన, అక్రమ మట్టి వ్యాపారం చేస్తున్న పరిగి తహసీల్దార్ ఆనంద్ రావు ను వెంటనే సస్పెండ్ చేసి, క్రిమినల్ కేసులు నమోదు చేసి అరెస్ట్ చెయ్యాలని ప్రజా సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కి పిర్యాదు చెయ్యడం జరిగింది.
ఈ సందర్బంగా సీఐటీయూ జిల్లా అధ్యక్షులు ఆర్. మైపాల్ మాట్లాడుతూ పరిగి మండలం,రంగంపల్లి గ్రామానికి చెందిన సర్వే నెంబర్ 146 మొత్తం విస్తీర్ణం :4-17ఎకరాలు కలదు. ఈ భూమి ఖారేజ్ ఖాతా సర్కారిభూమి కొంతమంది పేదలు ఖాస్తులో ఉండగా వారిని జీవనదారం కొరకు కొందరికి పాసుబుక్కులు ఇచ్చారు. ఇట్టి భూమి అమ్మడం కొనడం నేరం, కాని మన పరిగి తహసీల్దార్ ఆనంద్ రావు భూమిని తేది :09.09.2024 నాడు వేరే వ్యక్తులకు రిజిస్ట్రేషన్ చేశాడు. ఈ భూమి మళ్ళీ వేరే వ్యక్తులకు అమ్మడానికి స్లాట్ బుక్ చేసి వేరే వ్యక్తులకు అమ్మడానికి ప్రయత్నించగా ఆ భూమి ప్రభుత్వ భూమి అని ఇది రిజిస్ట్రేషన్ చెయ్యడానికి విలులేదు అని అధికారులు చెప్పారు.ఈ విషయంబాధితులు రాజకీయనాయకులను ,ఇతరులను ఆశ్రహించగా ఈ అక్రమ రిజిస్ట్రేషన్ బండారం బయటపడింది. పహాని రికార్డ్ లో ఈ భూమి స్వబావం 1954-55ఖస్రా,1955-56 చసాల ఖరీజఖాతా సర్కారి భూమిని పేర్కొనబడినది. అంటే ఇది ప్రభుత్వ భూమి ఈ భూమిని రిజిస్ట్రేషన్ చెయ్యడం చట్టావిరుద్ధం.
రంగం పల్లి గ్రామంలో సర్వే నెంబర్ 256 విస్తీర్ణం:20-23 ఎకరాల ప్రభుత్వ సీలింగ్ భూమి కలదు.ఈ భూమిలో 15 నెలలుగా చదును చేస్తూ చెట్లు, గుట్టను చదును చేస్తన్న తహసీల్దార్ ఆనంద్ రావు ప్రభుత్వ సీలింగ్ భూమిని అక్రమార్కుల చేతిలో పెట్టాడు. పర్యావరణన్ని నాశనం కావాడానికి ప్రోత్సహించరు. పరిగి మండలంలో అక్రమ మట్టి వ్యాపారులతో కుమ్మకై రాత్రి,పగలు తేడా లేకుండా మట్టి దందా కొనసాగిస్తూ పర్యావరణాన్ని దెబ్బతీస్తున్నడు .
గతంలో ఆనంద్ రావు తహశీల్దార్ గా పని చేసిన దుద్యాల మండలం గౌరారం గ్రామానికి చెందిన ఒక పట్టాదారుడు చనిపోతే అతని కుమారునికి విరసత్ చేయాల్సిన భూమి చేయకుండా వేరే వ్యక్తులకు పట్టా చేశారు ఈ విషయంపై జిల్లా కలెక్టర్ పిర్యాదు చేసిన అప్పుడు పట్టించుకోలేదు .అందుకే అదే దిమాతో ఈలాంటి అవినీతి ,అక్రమాలకు పాల్పడుతున్నా పరిగి తాహసిల్దార్ పై పూర్తిస్థాయి విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని లేకపోతే జిల్లా వ్యాప్తంగా ప్రజా సంఘాల ఐక్యవేదిక వికారాబాద్ జిల్లా కమిటి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు రఘురామ్, సత్యయ్య తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


