Indiramma Houses : మార్చ్ 5 నాటికి గ్రామీణ ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇండ్లు బేస్మెంట్ స్థాయికి చేరుకోవాలి

TRINETHRAM NEWS

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పై సమీక్ష నిర్వహించిన జిల్లా కలెక్టర్ శ్రీ హర్ష

త్రినేత్రం న్యూస్ పెద్దపల్లి ప్రతినిధి… పట్టణ ప్రాంతాలలో ఇందిరమ్మ ఇండ్ల గ్రౌండింగ్ పై దృష్టి పెట్టాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు.
మంగళవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సమీకృత జిల్లా కలెక్టరేట్ లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పనుల పై సంబంధిత అధికారులతో రివ్యూ నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ, మున్సిపల్ ఎన్నికల కోడ్ ముగిసినందున పట్టణాలలో నూతనంగా మంజూరు చేసిన ఇందిరమ్మ ఇండ్ల గ్రౌండింగ్ పై అధికారులు దృష్టి సారించాలని, ప్రతి వార్డు పరిధిలో ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహిస్తూ ఇండ్ల నిర్మాణ పనులు వేగవంతం అయ్యేలా చూడాలని కలెక్టర్ ఆదేశించారు.
గ్రామీణ ప్రాంతాల్లో మంజూరు చేసిన ఇందిరమ్మ ఇండ్ల మార్చ్ 5 నాటికి బేస్మెంట్ స్థాయికి చేరుకోవాలని కలెక్టర్ తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ఉపాధి హామీ పనులు, స్వచ్ఛ భారత్ మిషన్ క్రింద వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణానికి వచ్చే చెల్లిపులు లబ్ది దారుల అందరికీ చేరే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ మండల పరిషత్ అధికారులను ఆదేశించారు.
ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులలో పెట్టుబడి సమస్యలతో బాధపడుతున్న నిరుపేదలకు మహిళా సంఘాల ద్వారా లక్ష రూపాయల రుణం అందించాలని అన్నారు. అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ఎల్2 జాబితాలోని లబ్ధిదారులను ఎంపిక చేసి అట్టి లబ్ది దారులతోనీ 2 BHK పతకం ఇండ్ల క్రింద నిర్మించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.
ఈ సమావేశంలో పీడీ హౌసింగ్ రాజేశ్వర్, ఎంపిడిఓ లు,ఏ. ఈ.లు,సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Indiramma houses in rural areas should reach

You cannot copy content of this page

Scroll to Top