MLA Madhavaram : కూకట్‌పల్లిలో వృద్ధుడికి అండగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు

TRINETHRAM NEWS

శివనంద రీహాబిలిటేషన్ హోమ్‌కు తరలింపు.

కూకట్‌పల్లి ఫిబ్రవరి 24 (త్రినేత్రం న్యూస్) : కూకట్‌పల్లి పాత శివాలయం వద్ద కొద్ది రోజులుగా రోడ్డుపై అనాధ స్థితిలో నివసిస్తున్న వృద్ధుడి పరిస్థితి స్థానికులను కలిచివేసింది. ఆ వృద్ధుడు ఆహారం, వైద్యం లేక ఇబ్బందులు పడుతున్నాడని తెలిసి ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ విషయం కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు దృష్టికి వెళ్లడంతో ఆయన వెంటనే స్పందించారు. మానవతా దృక్పథంతో తక్షణ సహాయక చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఎమ్మెల్యే ఆదేశాల మేరకు నియోజకవర్గ ఎస్సీ విభాగ అధ్యక్షులు, కూకట్‌పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ బొట్టు విష్ణు స్పందించి ఆ వృద్ధుడిని శివనంద రీహాబిలిటేషన్ హోమ్ కు తరలించారు. అక్కడ వృద్ధుడికి అవసరమైన వైద్య పరీక్షలు, చికిత్స మరియు సంరక్షణ ఏర్పాట్లు చేశారు.
ఈ సందర్భంగా స్థానికులు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు యొక్క మానవతా దృక్పథాన్ని ప్రశంసించారు. అవసరమైన వారికి అండగా నిలిచి, తక్షణ స్పందనతో సహాయం అందించడం అభినందనీయమని పేర్కొన్నారు.
ప్రజల సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ సేవా కార్యక్రమాలు చేపడుతున్న ఎమ్మెల్యే చర్యలు మరింత ఆదర్శప్రాయంగా నిలుస్తున్నాయని స్థానికులు అభిప్రాయపడ్డారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

MLA Madhavaram Krishna Rao supports elderly man

You cannot copy content of this page

Scroll to Top