Indiramma Houses : అర్హులైన లబ్ధిదారులకు విడుతలవారీగా ఇందిరమ్మ ఇండ్లు

TRINETHRAM NEWS
Indiramma houses to eligible beneficiaries

పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ ప్రగతి పై హౌసింగ్ అధికారులతో సమీక్ష. నేనావత్ బాలు నాయక్ .

Indiramma Houses : దేవరకొండ డివిజన్ ఏప్రిల్ 01, త్రినేత్రం న్యూస్. దేవరకొండ పట్టణంలోని ఎమ్మెల్యే నివాసం (వ్యవసాయ మార్కెట్ యార్డ్) లో హౌసింగ్ అధికారులతో కలిసి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ ప్రగతిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇందులో భాగంగా పెండింగ్ నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని, ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు బిల్లులు సకాలంలో చెల్లించాలని అధికారులను ఎం ఎల్ ఏ బాలు నాయక్ ఆదేశించారు.

అన్ని వర్గాల సంక్షేమమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ లక్ష్యమని, అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రాధాన్యత క్రమంలో ఇందిరమ్మ ఇండ్లను పంపిణీ చేస్తామని అన్నారు. పేదల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని , అర్హులైన లబ్ధిదారులకు విడుతల వారీగా రూ.5లక్షలు అందజేయడం జరుగుతుందని ,అలాగే ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పేదల సొంతింటి కలను కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం నెరవేరుస్తుందని అన్నారు.
ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్దిదారులు ఎవరికి ఒక్క రూపాయి ఇవ్వద్దని, ఎవరైనా తీసుకుంటే వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. ప్రతి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లు లేని గ్రామాలు లేవని, పదేళ్ల తర్వాత కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో ఇందిరమ్మ ఇళ్లను ఇవ్వడం జరుగుతుందన్నారు.

ఈ కార్యక్రమంలో హౌసింగ్ పి డీ రాజ్ కుమార్, డీ ఈ నాగేందర్ గౌడ్, ఏ ఈ లు వినోద్, విజయ్, కుమార్, లావణ్య, సందీప్ రెడ్డి, చింత పల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాగభూషణం , మాజి ఎం పి పి భవాని పవన్ కుమార్, సీనియర్ నాయకులు యుగేందర్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షులు కిన్నెర హరికృష్ణ ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news

You cannot copy content of this page

Scroll to Top