
MLA Kavya Krishna Reddy : త్రినేత్రం న్యూస్ :మార్చ్ 31: నెల్లూరు జిల్లా: కావలి… నెల్లూరు జిల్లా,కావలి పట్టణంలోని బుడంగుంట 17వ వార్డు ఇందిరమ్మ కాలనీలో ఎన్‌టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమం బుధవారం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి పాల్గొని అధికారులు,పార్టీ నాయకులతో కలిసి లబ్ధిదారులకు స్వయంగా ఇంటింటికీ వెళ్లి పెన్షన్ అందజేశారు.అధికారులతో కాలనీలో ప్రతి ఇంటికి వెళ్లిన ఎమ్మెల్యే, లబ్ధిదారులతో ఆత్మీయంగా ముచ్చటించారు.
వారి ఆరోగ్య పరిస్థితులు,కుటుంబ పరిస్థితులు, ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు నిజమైన అర్హులకు చేరేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని ఈ సందర్భంగా తెలిపారు.పేదలు, వృద్ధులు, వికలాంగులకు ఆర్థిక భరోసా కల్పించడమే ఎన్‌టీఆర్ భరోసా పెన్షన్ పథక లక్ష్యమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రతి వర్గానికి అండగా నిలుస్తూ వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి కృషి చేస్తోందని అన్నారు. ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, అర్హులైన ప్రతి ఒక్కరికీ పథకాల ప్రయోజనం చేరేలా కృషి చేస్తామని స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా కాలనీ ప్రజలు తమ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా, వాటి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే స్వయంగా ఇంటికి వచ్చి పెన్షన్ అందజేయడంతో లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖ అధికారులు,కావలి పట్టణ అధ్యక్షులు గుత్తికొండ కిషోర్,ప్రధాన కార్యదర్శి జ్యోతి బాబురావు, 17వ వార్డు టిడిపి ఇంచార్జ్ పులిమి భాస్కర్ రెడ్డి, టిడిపి సీనియర్ నాయకులు రామిరెడ్డి, టిడిపి యువ నాయకుడు బాలకృష్ణ,టిడిపి పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news

