MLA Jare : ఇందిర బడిబాట మీ ఎమ్మెల్యే మీ పాఠశాలకు

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం

  • ములకలపల్లి మండలంలో పర్యటించిన ఎమ్మెల్యే జారె
  • అమ్మ ఆదర్శ పాఠశాల నిధులతో ప్రభుత్వ పాఠశాలలకు మౌళిక వసతులు కల్పన

ములకలపల్లి మండలంలో పర్యటించిన గౌరవ ఎమ్మెల్యే జారె ఆదినారాయణ పలు గ్రామపంచాయతీలలోని ప్రభుత్వ పాఠశాలలలో AAPC నిధులతో పూర్తి అయిన మౌళిక వసతులను పరిశీలించారు.ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ ఇందిర బడిబాట తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంచే చేపట్టబడిన ఈ కార్యక్రమం మైదాన ప్రాంత విద్యార్థిని విద్యార్థుల భవిష్యత్తును దూరదృష్టితో అలోచించి రూపొందించబడిందన్నారు. అమ్మ ఆదర్శ పాఠశాల నిధులను సమగ్రంగా వినియోగించి ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు, తరగతి గదులు, మరుగుదొడ్లు, మంచినీటి సౌకర్యం, ఫర్నిచర్, డిజిటల్ లెర్నింగ్ వేదికలు వంటి వాటిని సమకూర్చడం ద్వారా విద్యార్థులకు ఉన్నతమైన విద్యను అందించడానికి దోహదపడుతుందన్నారు.
ములకలపల్లి,మాదారం,జగన్నాధపురం, సీతాయిగూడెం గ్రామపంచాయతీల పరిధిలో ఉన్న పాఠశాలలలో పనులు పూర్తయ్యిన విధానం సంతృప్తిగా ఉందన్నారు. విద్యార్థుల భవిష్యత్తు బాగుండాలని తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా మంత్రులు బట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస రెడ్డి సహకారంతో విద్యా వైద్య రంగాలతో పాటు అశ్వారావుపేట నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తానని పేర్కొన్నారు.
పర్యటనలో భాగంగా ములకలపల్లి జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో ఇటీవల నిర్వహించిన చెకుముకి పోటీలలో చక్కని ప్రతిభ కనబరిచిన విద్యార్థిని విద్యార్థులను అభినందించి బహుమతులు అందించారు. భవిష్యత్తులో మరింత ప్రతిభ కనబరచి పాఠశాలకు తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలన్నారు. జగన్నాధపురం ఎంపీపీఎస్ పాఠశాలలో మధ్యాహ్న భోజనం మెనూ తీరును పరిశీలించి విద్యార్థులతో కలిసి రాగిజావ సేవించారు..
ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు తాండ్ర ప్రభాకర్, ఎమ్మార్వో గుడ్ల పుల్లారావు, ఎంపీడీవో రేవతి, ఎంఈఓ సత్యనారాయణ, ఐటిడిఏ ఏఈ సుబ్బరాజు, పంచాయతీరాజ్ ఏఈ సురేష్, జడ్పీ సీఈవో నాగలక్ష్మి, SI రాజశేఖర్, మాజీ జెడ్పిటిసి బత్తుల అంజి, మాజీ ఎంపీటీసీలు సున్నం సునీత,తాటి తులసి,మాజీ సర్పంచ్ లు కారం సుధీర్ కుమార్, సున్నం సుధాకర్, కీసర శ్రీను, ములకలపల్లి మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కోడిమే వంశీ కాంగ్రెస్ నాయకులు అనుమాల సత్యనారాయణ, కొప్పుల రాంబాబు, సురభి రాజేష్, వెలకం వెంకటేష్, గాడి తిరుపతిరెడ్డి, శనగపాటి రవి, ఎన్ఎస్ యుఐ మండల అధ్యక్షుడు గుంటూరు సాయిరాం, దుగ్గి సంపత్ కుమార్, అశ్వారావుపేట నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు పాలకుర్తి సుమిత్, ఎస్సీ సెల్ మండల కమిటీ అధ్యక్షుడు పాలకుర్తి రవి, కాంగ్రెస్ పార్టీ కిసాన్ సెల్ మండల అధ్యక్షుడు అచ్చైన వెంకటేశ్వరరావు, పామర్తి కృష్ణ , కౌలురి ప్రసాద్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Indira Badibata Your MLA

You cannot copy content of this page

Scroll to Top