SC Community : ప్రభుత్వంపై హర్షం వ్యక్తం చేసిన యస్ సి సామాజిక వర్గం

TRINETHRAM NEWS

తేదీ : 17/04/2025. గుంటూరు జిల్లా : అమరావతి : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం యస్ సి వర్గీకరణ పై ఆర్డినెన్స్ జారీ చేయడం జరిగింది. సంబంధిత సామాజిక వర్గాలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ వర్గీకరణ పూర్తిగా తెలుగుదేశం ప్రభుత్వంతోనే సాధ్యమైందని, గతం కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో వర్గీకరణకు మొట్టమొదట ప్రాధాన్యత ఇచ్చినటువంటి ఘనత నారా చంద్రబాబు నాయుడుకే దక్కింది.
అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగు వ సంవత్సరంలో రాజీవ్ రంజన్ మిత్రా ఏక సభ కమిషన్ నియమించడం జరిగింది. సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి యస్ సి వర్గీకరణ పై ఆర్డినెన్స్ జారీ చేసి రాబోవు మెగా డియస్ సి తో పాటు ప్రతి ప్రభుత్వ ఉద్యోగాలలో వర్గీకరణ అమల్లో ఉంటుందని, ఇది ప్రతి జిల్లాలో అమల్లో ఉంటుందని, మంత్రి మండల సమావేశంలో ఆమోదించారు. యస్ సి అంటే తెలుగుదేశం – తెలుగుదేశం అంటే యస్ సి.
అనే విధంగా సామాజిక వర్గానికి అంతగా ఉంటుందని సంతోషం వ్యక్తపరిచారు. పార్టీ లోక్ సభాపతిగా , శాసనసభాపతిగా దళితులను నియమించిన అన్న చరిత్ర తెలుగుదేశం పార్టీదని పొగిడారు. ఒక్క ఛాన్స్ అంటూ వచ్చిన వైసిపి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి అదే దళితులను చంపి డోర్ డెలివరీ చేశారని పలువురు దళితులను దండించి అవమానించారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో మోదుగు. వెంకటేశ్వరరావు, నామ. గోపాల్, కామాల.,రామారావు, కొమ్ము. బాబురావు, పనితి. నాగేశ్వరరావు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

SC community expresses happiness

You cannot copy content of this page

Scroll to Top