IndiGo Avoids Accident : ఇండిగో విమానానికి తప్పిన ప్రమాదం.. ఏం జరిగిందంటే

TRINETHRAM NEWS

Trinethram News : హైదరాబాద్, సెప్టెంబర్ 25: శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమాశ్రయంలో ఇండిగో విమానానికి (6E-816) పెను ప్రమాదం తప్పింది. ఈరోజు (గురువారం) ఉదయం జైపూర్ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టులో విమానం ల్యాండింగ్ అవుతున్న సమయంలో ఒక్కసారిగా ఫ్లైట్‌ను ఓ పక్షి ఢీకొట్టింది. వెంటనే అప్రమత్తమైన పైలెట్ ఎంతో సమయస్పూర్తితో వ్యవహరించి విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేశారు. ఆ సమయంలో విమానంలో మొత్తం 162 మంది ప్రయాణికులు ఉన్నారు. ఎంతో సురక్షితంగా విమానం ల్యాండ్ అవడంతో అటు ప్రయాణికులతో పాటు ఎయిర్‌పోర్ట్ అధికారులు కూడా ఊపిరిపీల్చుకున్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

IndiGo flight narrowly avoids accident

You cannot copy content of this page

Scroll to Top