రామగుండం నియోజకవర్గం శాసనసభ్యులు ఎం ఎస్ రాజ్ ఠాకూర్, వారి సతీమణి మనాలి ఠాకూర్
గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. తెలంగాణ సాంస్కృతిక పండుగ బతుకమ్మ వేడుకల్లో మహిళలు అత్యంత ఉత్సాహంగా పాల్గొన్నారు. మహిళలతో కలిసి బతుకమ్మ ఆడుతూ పాడుతూ మ్మెల్యే దంపతులు తెలంగాణ సంప్రదాయాలను స్మరించుకున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఎం ఎస్ రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ“బతుకమ్మ పండుగ తెలంగాణ ఆత్మను ప్రతిబింబించే పండుగ. ఈ పండుగ ద్వారా మహిళల సృజనాత్మకత, ఐక్యత, ఆచారాలు ప్రతిఫలిస్తాయి. ప్రభుత్వం పక్షాన బతుకమ్మ పండుగలను రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరపడం గర్వకారణం” అని తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మహిళ విభాగ అధ్యక్షులు, డివిజన్ అధ్యక్షులు, పార్టీ మహిళా నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని బతుకమ్మ సంబురాలను మరింత అందంగా తీర్చిదిద్దారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe
